లైట్ తీస్కో…..

హన్మకొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆగని సబ్ రిజిస్టార్ తమ్ముడి దందా….

ఆ కార్యాలయంలో వారి ఇష్టం.. ఏదైనా సక్రమంగా లేని పని కావాలంటే వీరిని సంప్రదిస్తే చాలట. ఎవరి భయం వీరికి ఏది లేదట ఎంతటి పనిచేసిన అది అక్రమ పని ఐయిన చేసి టెకీట్ ఈజీ పాలసీ అంటారట హన్మకొండ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ తమ్ముడికి తోడు మరో ముగ్గురు ఇక్కడ తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారట. ఈ ముగ్గురిని కలుపుకొని సబ్ రిజిస్టార్ తమ్ముడి అక్రమ దందా జోరుగా కోనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి

లైట్ తీస్కో.....- news10.app

లైట్ తీస్కో…..

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కావాల్సిన డాక్యుమెంట్ లు ఏవి లేకున్నా రిజిస్ట్రేషన్ లు విజయవంతంగా చేసే సబ్ రిజిస్టార్ తమ్ముడు తనపై ఏ ఆరోపణలు వచ్చిన,అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేస్తున్న ఎవరు ఇదేంటని ప్రశ్నించిన లైట్ తీస్కో అని తన తోటివారికి ధైర్య వచనాలు వల్లిస్తున్నాడట..అధికారులకు సైతం తాను చెప్పింది చేయాలని ఎలాంటి అడ్డంకులు వచ్చిన తాను చూసుకుంటానని చెపుతున్నాడట.తన అన్న ఇక్కడ అధికారి కావడంతో ఆయన అండతో రెచ్చిపోతున్నట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విమర్శలు వినవస్తున్నాయి.అన్నకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ లకు మూలం గా ఉన్న ఇతగాడు అన్న సబ్ రిజిస్టార్ అవినీతికి “సంజీవ”నిగా మారినట్లు సమాచారం తమ్ముడు ఒకే అంటే చాలు సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ పని ముగించేస్తాడట.తనకు రావాల్సింది వచ్చింది అని తెలిస్తే చాలు ఎలాంటి పత్రాలు,అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్ పనిని ఎలాంటి ఆటంకం లేకుండా ముగించేస్తాడట.

పైన మనోళ్లు ఉన్నారు…?

హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ సబ్ రిజిస్టార్ అతగాడి తమ్ముడి అక్రమ దందాకు అడ్డుచెప్పే వారు లేరని వీరిద్దరి తెగ ధీమా వ్యక్తంచేస్తున్నారట. తామేం చేసిన ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన తమపై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన పైనున్న అధికారులు తమను కాపాడుకుంటారని అతి విశ్వాసంతో ఉన్నారట. ఇటీవల ఈ సబ్ రిజిస్టార్ కు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీచేసిన ఉన్నతాధికారులు ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ,ఈ సబ్ రిజిస్టార్ పై విచారణను కూడా కొనసాగించక పోవడం రిజిస్టార్ కార్యాలయంలో పలు అనుమానాలకు దారితీస్తోంది… సబ్ రిజిస్టార్ తన తమ్ముడి మధ్యవర్తిత్వంతో ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ,చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లు అందుకు సాక్ష్యన్గా ఉన్న మరి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదు.ఉన్నాతాధికారులను తాము నెలవారిగా ప్రసన్నం చేసుకుంటున్నాం కనుకనే తమపై ఎలాంటి చర్యలు ఉండడం లేదని,ఇకముందు కూడా ఉండబోవమని తమ సన్నిహితుల వద్ద సబ్ రిజిస్టార్ ,అతగాడి తమ్ముడు వాఖ్యనిస్తున్నారట …మరి ఇకనైనా ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here