“డబుల్ ” ఒకే…. – ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ఈ నెల 29 లోపే జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ లకు శంకుస్థాపన… – ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా హనుమకొండ నగరంలో ప్రతిష్టాత్మకంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముందే జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించే స్థలాలను పరిశీలించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. మంగళవారం బాలసముద్రం లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశమందిరంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై ప్రసంగిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ సొంత ఇల్లు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎంతోమంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని ఎన్నో సార్లు వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలి అని దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేసినప్పటికీ అనేక కారణాల చేత జర్నలిస్ట్ ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన వాయిదా పడుతూ వచ్చిందని కానీ ఈ నెల 29న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉండడంతో ఆలోపే స్థల పరిశీలన చేసి ఇండ్ల శంకుస్థాపనకు కృషి చేస్తానని ఆయన జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.

"డబుల్ " ఒకే.... - ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్- news10.app

ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, సీనియర్ జర్నలిస్టు బిఆర్ లెనిన్, దాసరి కృష్ణారెడ్డి, శంకేసి శంకర్ రావు, నాయకపు సుభాష్, గాడె పల్లి మధు, గడ్డం కేశవమూర్తి కె. కుమారస్వామి రమణ, పెద్దిషు,తోట సుధాకర్ పొగాకుల అశోక్,సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here