తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు పాజిటివ్
రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా

కరోన పాజిటివ్ ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను వణికిస్తోంది. నిన్నటివరకు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గో వర్ధన్ రెడ్డి లకు కరోన పాజిటివ్ గా నిర్దారణ కాగా తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిలాల గణేష్ గుప్తాకు కరోన సోకింది. కరోన లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోన పాసిటివ్ గా తేలింది. దింతో వైద్యం కోసం ఆయన హుటాహుటిన హైద్రాబాద్ బయలుదేరి వెళ్లారు. కాగా ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎవరెవరితో కాంటాక్టులో ఉన్నారో వివరాలు సేకరించి వారిని హోమ్ క్వారెంటైన్ లో ఉంచే విదంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాగా కరోన ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యే లకు రావడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కరోన రాకుండా ముందు జాగ్రత్త చర్యలను మరింత కట్టుదిట్టంగా పాటించేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా- news10.app