ముంబై ని వణికిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి ముంబై వాసులను భయపెడుతోంది. ముంబై వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల్లో మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ముంబైలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం ఒకా రోజే ఇక్కడ 198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై వాసులు కలవర పడుతున్నారు.మరోవైపు కరోనా వైరస్ తో ముంబైలో ఈ ఒక్కరోజే 11 మంది మృతి చెందారు దీంతో కరొనాతో ఇక్కడ మరణించిన వారి సంఖ్య 75 కు చేరింది. లాక్ డౌన్ తో కరోనా ను కొంత కట్టడి చేయగలిగిన అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాసిటివ్ కేసులతో ముంబై వాసుల్లో కొంత ఆందోళన కనబడుతోంది.

మరోవైపు పుణెలో సైతం కరోనా భయపెడుతోంది. ఒక్క రోజు ఇక్కడ ముగ్గురు మృతి చెందారు.ఇప్పటి వరకు పునే లో 29మంది మరణించారు.దీంతో పూణె వాసుల్లో సైతం ఆందోళన కనబడుతోంది.