బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా మహమ్మారి నీ అరికట్టేందుకు ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తునట్లు సీ ఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు ఎలాంటి పరీక్షలు ఉండవని పై తరగతులకు పంపిస్తామని అన్నారు. పదవతరగతి పరీక్షల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని,రాష్ట్రంలో ఇప్పటి వరకు 503 పాజిటివ్ కేసులు ఉండగా వీటిలో 393 ఆక్టివ్ గా ఉన్నయనారు. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రానికి పంపిస్తామని రాష్ట్రం తరపునుంచి కొన్ని డిమాండ్లను సైతం పంపుతునమన్నారు. ఈ నెల 15 వరకు పంటలకు సాగునీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.