గురుకుల పాఠశాలలో మందు పార్టి….

బిల్డింగ్ యజమానే సూత్రధారి… అతడి అరెస్ట్ కు రంగం సిద్ధం

అదొక పవిత్ర గురుకుల విద్యాలయం …దానికి తోడు బాలికలు విద్యనభ్యసిస్తున్న విద్యాలయం అది… బాలికల విద్యాలయం కనుక సంబంధం లేని ఏ వ్యక్తి అందులోకి ప్రవేశించడానికి వీలులేదు… ఇందులో విద్యనభ్యసిస్తున్న బాలికల తల్లిదండ్రులు, బందువులనే సవాలక్ష ప్రశ్నలు అడిగి కేటాయించిన టైం లోనే వారిని కలవడానికి అనుమతి ఇస్తారు… అలాంటిది బాలికల గురుకుల పాఠశాల కోసం తన బిల్డింగ్ ను కిరాయకు ఇచ్చినందుకు పాఠశాల పైనే ఓ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేసుకొని తానా తందాన అంటూ మద్యం పార్టీ చేసుకుంటు బిల్డింగ్ యజమాని బరితెగించినట్లు తెలుస్తుంది.ఇటీవల వరంగల్ ఖమ్మం బైపాస్ రోడ్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో బిల్డింగ్ యజమాని ఇచ్చిన మద్యం విందుకు హాజరయిన ఓ విలేకరి పాఠశాల ఆవరణలో లోకి మద్యం తాగి వచ్చి ఆరవ తరగతి విద్యార్తినితో అసభ్యకరంగ ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసభ్యంగా ప్రవర్తించిన విలేకరిని బాలిక తల్లిదండ్రులు చితకబాదారు.
మిల్స్ కాలనీ పోలీసులు ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేశారు.

గురుకుల పాఠశాలలో మందు పార్టి....- news10.app

సూత్రదారి అతడే….?

బాలికల గురుకుల పాఠశాలకు తన భవనాన్ని కిరాయకు ఇచ్చి భవనం పైనే రోజు కొంతమందితో కలిసి మద్యం సేవిస్తున్న బిల్డింగ్ యజమానే ఈ మందు పార్టి లకు సూత్రాదారి అని తెలిసింది.ఇటీవల ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రోజు బిల్డింగ్ యజమాని గురుకుల పాఠశాల భవనం పైనే మద్యం పార్టి ఇచ్చినట్లు సమాచారం.ఈ సంఘటన జరగగానే బిల్డింగ్ యజమాని మరికొంతమంది అక్కడినుంచి పారిపోయినట్లు తెలిసింది. పూటుగా మద్యం సేవించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విలేకరి మాత్రం బాలిక తల్లితండ్రుల చేతిలో తన్నులు తిన్నాడు.అయితే ఈ మద్యం పార్టీలు ఇక్కడేం కొత్త కాదట గత కొన్ని నెలలుగా బాలికల గురుకుల పాఠశాల భవనం పైన ఉన్న ఓ గదిలో నిత్యం జరుగుతున్నట్లు తెలిసింది.సాయంత్రం ఐయిందంటే చాలు ఆ బిల్డింగ్ యజమాని కొంతమందితో కలిసి గురుకుల పాఠశాలలోనే మద్యం సేవిస్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది.

ప్రిన్సిపాల్ , బిల్డింగ్ యజమాని దోస్తాన…..?

బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ,బిల్డింగ్ యజమాని దోస్తానా బాగానే ముదిరిపోయినట్లు తెలుస్తోంది.బిల్డింగ్ యజమాని రోజు బాలికల గురుకులం లోకి వచ్చి మద్యం సేవించిన మందలించని ప్రిన్సిపాల్ తాను కూడా వారానికోసారి తానా తందాన బ్యాచ్ తో జాతకడ్తాడని తెలిసింది.ప్రతి ఆదివారం బిల్డింగ్ యజమాని తో కలిసి మద్యం సేవిస్తాడని సమాచారం.బాలిక పట్ల అసబ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి రాగానే ప్రిన్సిపాల్ బిల్డింగ్ యజమానిని ఎదో మాటవరుసకు మండలించాడు తప్ప పోలీసులు చర్యలు తీసుకోవాలని పిర్యాదు సైతం చేయలేదని కొంతమంది విద్యార్థినిల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పిల్లలను కంటికిరెప్పలా కాపాడాల్సిన ప్రిన్సిపాల్ వారితో కలిసి పాఠశాలలోనే మద్యం సేవిస్తే ఇక వారికి రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.

పాఠశాల పై గెస్ట్ హౌస్….?

బాలికల గురుకుల పాఠశాల కోసం తన బిల్డింగ్ ను కిరాయకు ఇచ్చిన యజమాని పాఠశాల పై ఉన్న గెస్ట్ హౌస్ ను అలాగే తన ఆధీనంలో ఉంచుకొని ఇక్కడే సాయంత్రం కాగానేనిత్యం మద్యం పార్టీలో మునిగిపోతున్నట్లు తెలిసింది.ఈ పార్టీలో మద్యం సేవించి గురుకులంలో చదువుతున్న కొంతమంది బాలికలను మాటలతో అసబ్యంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.ఇటీవల ఓ ఘటన వెలుగులోకి రావడంతో మిగతా బాలికలు సైతం నిత్యం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువచ్చారట.కొంతమంది నేరుగా పోలీసులకు సైతం పిర్యాదు చేసినట్లు తెలిసింది.

ముందు జాగ్రత్త చర్యలు వద్దా…?

బాలికల గురుకుల పాఠశాలలో నే నిత్యం మద్యం సేవించడం బాలికల పట్ల అసబ్యంగా ప్రవర్తించడం,బిల్డింగ్ యజమాని అనే సాకుతో ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం ఇప్పటికి కూడా స్పందించక పోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.ఇంటర్ వరకు చదువుకుంటున్న బాలికలు ఉంటున్న బాలికల గురుకులం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.సంక్షేమశాఖ అధికారులు,విద్యాశాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఆవేదన చెందుతున్నారు. సంఘటన తీవ్రంగా ఉంటే తప్ప చర్యలు తీసుకోరా…ఒకవేళ జరగరాని సంఘటనలు జరిగితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

కేసు నమోదుకు రంగం సిద్ధం…?

ఇప్పటివరకు గురుకుల పాఠశాలలో బాలిక పట్ల అసబ్యంగా ప్రవర్తించిన విలేకరి పై కేసు నమోదు చేసిన పోలీసులు పాఠశాల భవనం యజమానిపై సైతం కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.రేపో మాపో పోలీసులు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here