న్యూస్ 10 దినపత్రికలో బుధ వారం ప్రచురితమైన అతడే సూత్రధారి కథనానికి అధికారులు స్పందించారు. గురువారం వరంగల్ ఖమ్మం బైపాస్ రోడ్ లో గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి తనిఖిచేశారు. ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్ హాస్టల్ కు వెళ్లి తరగతి గదులను ,డైనింగ్ హాల్ ను పరిశీలించారు. అనంతరం విద్యార్తిలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమకు సొంత భవన నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ను కోరారు.బిల్డింగ్ కు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని విద్యార్థులు తెలిపారు. దింతో వెంటనే స్పందించిన కలెక్టర్ నూతన భవన నిర్మాణానికి భూమి సేకరించి కేటాయించాలని ఆర్డీవోను ఆదేశించారు. విద్యార్థుల రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ప్రిన్సిపాల్ అంజిరెడ్డి కి సూచించారు. ఇకపై గురుకులంలో ఎలాంటి సంఘటనలు జరిగిన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.హాస్టల్ ను పరిశీలించిన కలెక్టర్ వెంట వరంగల్ ఆర్డీవో మహేందర్ జీ, వసతి గృహాల ఆర్సీఓ మనోహర్ రెడ్డి ,మిల్స్ కాలనీ ఎస్సై కుమారస్వామి ఉన్నారు.