డ్యూటీ నిల్…. అటెండెన్స్ పుల్ ఆ డాక్టర్ల తీరే వేరు

పేరుకు పెద్దాసుపత్రి ఓ ప్రత్యేక వ్యాధికి పెద్దదిక్కుగా ఉంటూ వేలాదిమంది రోగులకు రోగాన్ని నయం చేయాలనే సంకల్పంతో ఏర్పడ్డ ప్రభుత్వాసుపత్రి ఉమ్మడి జిల్లాలోనే ఆ ఆసుపత్రి అంటేనే తెలియని వారుండరు కానీ అంత పెద్ద ఆసుపత్రి భాద్యతలు నిర్వహించే పెద్దసారు విధుల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట… విధులకు రాకుండా నెలరోజుల సంతకాలు ఒకేసారి పెడుతున్నారట ఆయనకు తోడు ఆర్ ఎం వో కూడా నాకేం తక్కువ నేనెందుకు రోజు రావాలి వారానికి రెండు రోజులే వస్తా అని ఇష్టమున్నట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం ఈ ఇద్దరధికారులు సమయానికి జీతం తీసుకుంటారట కానీ విధులకు మాత్రం అసలే హాజరుకారటడ్యూటీ నిల్.... అటెండెన్స్ పుల్ ఆ డాక్టర్ల తీరే వేరు- news10.app

నెలరోజుల సంతకాలు ఒకేసారి…?

విధులకు ఎగనామం పెట్టి దర్జాగా రాష్ట్ర రాజధానిలో ఉంటున్న ఆ పెద్దసారు విధులకు హాజరు కాకుండానే రోజు వచ్చి కష్టపడ్డట్లు హాజరు పుస్తకంలో నెలరోజుల సంతకాలు ఒకే సారి పెడుతున్నారట పైగా సారు సంతకం పెట్టాలంటే రాజధానికి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకెళ్లాల్సిందేనట ఇక్కడి ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగి నెలకోసారి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకువెళ్తే సారు సంతకాలు ఉద్యోగ బాధ్యతల్లో తరించిపోతారట.

ఆసుపత్రిలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిననాటినుంచి ఈ సూపరిండెంట్ సార్ వేళ్ల మీద లెక్కపెట్టినన్ని సార్లు కూడా విధులకు హాజరు కాలేదని తెలిసింది. విధులకు హాజరు కాకున్న పుల్ గా హాజరు వేసుకొని క్రమం తప్పకుండా నెల నెల జీతం లెక్కపెట్టుకుంటున్నాడట. ఈ సారు కు తోడు ఇదే ఆసుపత్రిలో పనిచేసే ఆర్ ఎం ఓ సైతం సేమ్ టు సేమ్ పెద్దసారు చేస్తున్న పనినే ఆనుసరిస్తుందట.

ఈ మేడమ్ గారు సైతం సంతకాలు అన్ని ఒకేసారి పెడుతూ విధులకు హాజరు కాకున్న హాజరు ఐయినట్లే చేస్తూ నెల జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. పెద్ద సారు చేయగా లేనిది తాను చేస్తే ఏంటని ఈ ఆర్ ఎం ఓ ఉద్యోగం చేస్తున్న ఆసుపత్రిని మరిచి చాలా రోజులే ఐయిందని ఆసుపత్రి సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే నిత్యం రోగులతో నిండిపోయే ఈ ఆసుపత్రిలో పెద్దసారు పర్యవేక్షణ లేక కిందిస్థాయి సిబ్బంది కూడా తమకేం పట్టనట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు ఎగనామాల వైద్యాధికారుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తుంది.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకునే ఈ ఇద్దరధికారుల పై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారో లేక వారికి వంతపాడుతారోనని మిగతా ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here