హరీష్ అకాడమీలో కీచక గురువు…!

కామ తురాణం …న భయం! న లజ్జ అచ్చంగా ఇలాగే ఉంది ఓ ప్రయివేటు అధ్యాపకుడి తీరు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇతగాడు పోటీ పరిక్షలకోసం తన వద్ద కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతిని ఏవో మాయమాటలు చెప్పి లొంగదీసుకొని అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు వెల్లడించిన వివరాలప్రకారం హన్మకొండ లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి నయీమ్ నగర్ లోని హరీష్ అకాడమీలో గ్రూప్2 పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటుంది… ఇదే అకాడమీలో చరిత్ర ను బోధించే ఓ అధ్యాపకుడి కళ్ళు ఆ యువతి పై పడ్డాయి… ఎలాగోలాగు లొంగ దీసుకోవాలని చూసిన ఆ అధ్యాపకుడు అకాడమీలో ఆ యువతి ఫోన్ నంబర్ సేకరించి మాట్లాడడం మొదలుపెట్టాడు.

హరీష్ అకాడమీలో కీచక గురువు...!- news10.app

అకాడమీలో చరిత్ర బోధిస్తున్న అధ్యాపకుడు కనుక తాను కూడా ఫోన్ చేసినవుడు తరుచుగా మాట్లాడుతూ ఉండేది…. నీలాంటి పద్దతి గల సంస్కారవంతమైన అమ్మాయిని తానెప్పుడూ చూడలేదని, ఇన్ని కోచింగ్ సెంటర్ లల్లో వేల మంది అమ్మాయిలను చూసిన నీలాంటి వారిని చూడలేదని.. నీకు ప్రత్యేకంగా సబ్జెక్టు బోధిస్తానని, అదనపు మెటీరియల్ అందిస్తాననని మాయమాటలు చెప్పి నమ్మించిన సదరు అధ్యాపకుడు… స్నేహం అంటూ ఒక్కసారిగా తన కామపు బుద్దిని చూపించాడు… నిన్ను చూడాలని ఉంది… రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి నగరంలో తాను కిరాయకు ఉంటున్న ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి భోరుమంది. ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి ఉద్యోగ పోటీ పరీక్ష కోసం వస్తే తనను లొంగదీసుకోవాలని మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన అధ్యాపకుడిపై పిర్యాదు చేయడానికి బాధితురాలు భయపడుతుంది.

ఈ విషయం తన ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని ఆవేదన చెందుతుంది. దింతో తోటి విద్యార్థులు ధైర్యం చెప్పడంతో పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేసేందుకు బాధితురాలు సిద్ధమవుతుంది. వివాహమయి ఓ కూతురు ఉన్న ఈ అధ్యాపక ప్రబుద్ధుడు నగరంలోని మరో కోచింగ్ సెంటర్ లో నల్గొండ లోని ఓ కోచింగ్ సెంటర్ లో సైతం చరిత్ర బోధిస్తాడట… పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ ఇలా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here