భూ కబ్జా ఆరోపణలపై ఈటల వివరణ..

తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.

ముందస్తు ప్రణాళికతో దుష్ప్రచారం చేశారని, తనపై కట్టుకథలు అల్లారని ఆరోపించారు. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదన్నారు. అంతిమ విజయం ధర్మానిదే పౌల్ట్రీకి భూమి ఎక్కువగా కావాలి ,కెనరా బ్యాంక్‌ ద్వారా 100 కోట్ల రుణం తీసుకున్నాం,విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖరాశా,విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లా భూమిని రైతులే స్వచ్ఛందంగా సరెండర్‌ చేశారు, అది వ్యవసాయ భూమి కాదు, 6 లక్షలకు ఎకరా చొప్పున 40 ఎకరాలు కొన్నాం, నేను ఎవరి భూమినీ కబ్జా చేయలేదు, నా మొత్తం చరిత్ర, ఆస్తులపై విచారణ చేపట్టాలి, ఎక్కడైనా తప్పుచేసినట్టు తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధం, ఆస్తులు, పదవుల కోసం ఈటల లొంగడు నా ఆత్మగౌరవంకంటే ఈ పదవి గొప్పకాదు, కొన్ని చానళ్లు పెయిడ్‌ మీడియాగా వ్యవహరించాయి, ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ సంపూర్ణ విచారణ జరపాలి, సిట్టింగ్‌ జడ్జితో కూడా విచారణ జరిపించాలి.

భూ కబ్జా ఆరోపణలపై ఈటల వివరణ..- news10.app