న్యూస్ 10 కథనానికి స్పందన

తూము షట్టర్ ధ్వంసం …చెరువును పరిశీలించిన అధికారులు

శాయంపేట మండలం లోని నాగసముద్రం చెరువు తూము షట్టర్ లను ధ్వంసం చేసి అక్రమంగా నీటిని వదిలిన చేపల వ్యాపారి పై ఏప్రిల్ 29 న “చేపల కోసం తూము షట్టర్ ధ్వంసం” అనే శీర్షికన వార్తాకథనం వెలువడిన సంగతి తెలిసిందే.ఈ కథనం పై ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది.

న్యూస్ 10 కథనానికి స్పందన- news10.app

శాయంపేట మండలం లోని నాగసముద్రం చెరువు తూము షట్టర్ లను శాయంపేట మండల తాసిల్దార్ హరికృష్ణ, ఇరిగేషన్ ఈ వినోద్ కుమార్ లు పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ నాగసముద్రం చెరువు తూము షట్టర్ నీ ధ్వంసం చేసిన చేపల వ్యాపారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తూము నుండి ఇ మీరు బయటికి రాకుండా రైతుల సమక్షంలో ఇసుక బస్తాలను అడ్డుగా వేశామన్నారు. చేపల కోసం తూము షట్టర్ ధ్వంసం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ధ్వంసమైన తూము షట్టర్ ని రెండు రోజుల్లో రిపేరు చేయిస్తామని ఏ ఈ తెలిపారు.