నకిలీ ఇన్స్యూరెన్స్ టాస్క్ పోర్స్ పోలీసుల నజర్ …..?

టాస్క్ పోర్స్ అదుపులో పలువురు ఏజెంట్లు

నకిలీ ఇన్స్యూరెన్స్ లపై వరంగల్ టాస్క్ పోర్స్ పోలీసులు నజర్ వేశారు.ఇటీవల వరంగల్ రవాణా శాఖ కార్యకాయంలో నకిలీ ఇన్స్యూరెన్స్ లతో వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని సమాచారం అందుకున్న టాస్క్ పోర్స్ నకిలీ ఇన్స్యూరెన్స్ లు తయారు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇందులో భాగంగా శనివారం వరంగల్ రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న పలు ఇంటర్ నెట్ సెంటర్ లల్లో,ఆర్టిఏ ఏజెంట్ల కార్యాలయాల్లో టాస్క్ పోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో భాగంగా కొంతమంది ఎజెంట్లను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు విచారించినట్లు తెలిసింది.

నకిలీ ఇన్స్యూరెన్స్ టాస్క్ పోర్స్ పోలీసుల నజర్ .....?- news10.app

నాకు సమాచారం లేదు డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ , కమిషనర్ పురుషోత్తం

నకిలీ ఇన్సూరెన్స్ లతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రవాణాశాఖ కార్యాలయం చుట్టు పక్కల ఏజెంట్ ల కార్యాలయాల్లో తనిఖీలు చేసి కొంతమంది ఏజెంట్ లను అదుపులోకి తీసుకున్నారు ఈ విషయమై ఉపరవాణా కమిషనర్ పురుషోత్తం ను వివరణ కోరగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మా కార్యాలయంలోనికి రాలేదని ఏజెంట్ లను అదుపులోకి తీసుకున్న సమాచారం నాకు తెలియదని న్యూస్-10కు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here