నెక్కొండలో విచ్చలవిడి దందా..

  • అడ్డాగోలుగా లింగనిర్ధాన పరీక్షలు
  • అడ్డుకోలేక పోతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

నెక్కొండ మండల కేంద్రంలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడపిల్ల అని తెలిస్తే అడ్డగోలుగా అబార్షన్లు చేస్తూ పాపపు సొమ్ము కూడబెట్టుకుంటున్న గ్రామ పంచాయతీకి సమీపంలోని ఓ దవాఖాన చీకటి వ్యవహారాన్ని న్యూస్ 10 వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే… అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ దవాఖాన లో ఓ గైనకాలాజీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆడపిల్ల అని తెలిస్తే చాలట క్షణాల్లో నెక్కొండలో వాలిపోతుందట, ప్రతిరోజు సాయంత్రం నుండి తెల్లవారే వరకు అబార్షన్లు తో బిజీగా ఉండే ఆ గైనకాలజీ వేలల్లో కమిషన్లు తీసుకుంటూ రెండు చేతులా సంపాధిస్తున్నట్లు తెలుస్తోంది…

నెక్కొండలో విచ్చలవిడి దందా..- news10.app

‘మొ’త్తం సూత్రధారి ఆయనే….

ఈ ఆస్పత్రిలో జరుగుతున్న చీకటి తతంగానికి ఆ కంప్యూటర్ సారే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాల ఆర్ఎంపీ, పీఎంపీ లతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వారికి పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లిస్తూ ఆస్పత్రికి ఆదాయాన్ని సమకూరుస్తున్నట్లు గుసగుసలు గట్టిగ వినిపిస్తున్నాయి. ఆస్పత్రి పెద్ద సారు కొడుక్కి అత్యంత సన్నిహితంగా ఉండే ఇతన్ని కలవందే దవాఖానలో ఏ పని కాదట…

జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన న్యూస్ 10 ‘ నెక్కొండలో కాసుల కోతలు’ కథనానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారి అలర్ట్ అయ్యారు. అక్రమ అబార్షన్లు , గర్భ నిర్దారణ పరీక్షలు చేస్తున్న ఆ దవాఖాన పై కొరడా ఝుళిపించేందు సిద్ధపడ్డట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here