నెక్కొండలో కాసుల కోతలు…?

  • విచ్చలవిడిగా గర్భ నిర్ధారణ పరీక్షలు
  • అడ్డగోలుగా అబార్షన్ లు..
  • గ్రామ పంచాయతీ సమీపంలో గలీజు దందా…
  • పట్టింపులేని వైద్య ఆరోగ్యశాఖ

నెక్కొండ మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రి యాజమాన్యం కాసుల కక్కుర్తి కి బరి తెగించింది, అందులోని డాక్టర్లు పాపం, పుణ్యం అవేమి పట్టించుకోకుండా అడ్డగోలు సంపాదనకు తెగబడ్డారు. పైసలు ఇస్తే చాలు ఎంతటి పాపనికైనా ఒడిగడుతున్నారు…

నెక్కొండలో కాసుల కోతలు...?- news10.app

ఇక వివరాల్లోకి వెళితే నెక్కొండ గ్రామ పంచాయతీ కి సమీపంలో ఓ ప్రైవేటు దవాఖానాలో ఆడ పిల్ల అని తెలిస్తే చాలు భ్రుణహత్యలు చేస్తూ అభం శుభం తెలియని పసిపిండాలను కడుపులోనే చిదిమేస్తున్నారు.
భ్రుణహత్యలు మహాపాపం, చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అవేమి పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

మొదటి సంతానం గా ఆడపిల్ల కలిగిన వివాహితులకు వివాహం కాకుండా గర్భం దాల్చిన యువతులను టార్గెట్ గా చేసుకొని అడ్డగోలుగా అబార్షన్లు చేస్తూ వేలల్లో సంపాదిస్తున్నారని తెలుస్తుంది. నెక్కొండలోని ఆ దవాఖాన గర్భ నిర్ధారణ పరీక్షలకు ,అబార్షన్లకు పెట్టింది పేరుగా మారిందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉండే అర్ఎంపీ,పీఎంపీ లతో సంబంధాలు కొనసాగిస్తూ వారికి కమిషన్లు ముట్టజెప్పుతూ తమ వైద్య వ్యాపారాన్ని మూడు పరీక్షలు ఆరు అబార్షన్లు అన్న చందంగా కొనసాగిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల గర్భిణీలే కాకుండా హైద్రాబాద్ లాంటి ప్రాంతాల నుండి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ల కోసం వస్తున్నారంటే ఈ దవాఖాన అబార్షన్లకు ఎంత ఫెమాసో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా అనేక వివాదాలు కారణంగా అధికారులు దవాఖానను సీజ్ చేసినా కేసులు పెట్టినా వీరి ప్రవర్తన లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.

ఆర్ఎంపీలే ద్వారానే ఆస్పత్రికి ఆదాయం….

అబార్షన్లతో నిత్యం రద్దీగా ఉండే ఈ దవాఖానకు గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీ లే ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నట్ల తెలుస్తుంది. గర్భిణీ స్త్రీలను తీసుకురావడం మొదలు మరల తిరిగి వెళ్లే వరకు వీరితోనే ఆస్పత్రి యాజమాన్యం సంబంధాలు కొనసాగిస్తుందట..

ఈ ఆసుపత్రిలో ఒక్కో పేషంట్ దగ్గర నుండి లింగ నిర్ధారణ పరీక్షకు 8 నుండి 10 వేలు అబార్షన్ కు 25 వేల నుండి 30 వేల వరకు ఫీజులు వసూలు చేసి వారికి కమిషన్లు ఇస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు ఐదు నుండి ఆరు వరకు అబార్షన్లు చేస్తూ రెండు చేతులా సంపాధిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టుల కోసం అయినా ఆడపిల్ల అని తెలిసిన అనంతరం అబార్షన్ కోసం అయినా ఆస్పత్రిలో ని ఆ ఇద్దరిని కలిస్తే చాలట….

గ్రామ పంచాయతీ కి సమీపంలో నే గలీజు దందా..

నెక్కొండ మండల కేంద్రంలో అత్యంత రద్దీగా ఉండే గ్రామ పంచాయితీకి ఆమడ దూరంలోనే ఈ హాస్పిటల్ ఉండటం అంతటా చర్చనీయాంశం అయ్యింది ఇంత జరుగుతున్న వైద్య శాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటంలేరు. ఈ దవాఖానలో జరుగుతున్న తతంగం అంతా వారి కనుసన్నల్లోని వ్యవహారమే అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్య వెళ్లినా అటువైపు సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలా సందిస్తారో వేచి చూడాలి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here