ఎంజీఎం లో షాడో సూపరింటెండెంట్…..?

వరంగల్ ఎంజీఎం లో షాడో సూపరింటెండెంట్ ఇష్టారాజ్యం నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…. ఇంచార్జ్ సూపరింటెండెంట్ ఉన్న ఈ షాడో సూపరింటెండెంట్ హవానే ఎంజీఎం లో జోరుగా నడుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది….. ఎంజీఎం లో ఏ పని కావాలన్న ఈ షాడో సూపరింటెండెంట్ కనుసన్నల్లోనే నడుస్తుందట…. ఈ ప్రచారానికి తోడు ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న సూపరింటెండెంట్ సైతం ప్రతి పనికి అతగాడి పైనే ఆధారపడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది… ఎంజీఎం లో ఏ పని కావాలన్న ఈ షాడో సూపరిండెంట్ సాబ్ ఓ మాట చెపితే చాలు పని ఇట్టే ఐపోతుందట…

ఎంజీఎం లో షాడో సూపరింటెండెంట్.....?- news10.app

ఆసుపత్రి లో వైద్యం చేస్తూ తనకు కేటాయించిన విధులను తాను నిర్వర్తించాల్సిన ఈ డాక్టర్ సాబ్ ఆసుపత్రి లోని అన్ని విభాగాల్లో తన పెత్తనాన్ని ప్రదర్శిస్తూ అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. ఎంజీఎం లో షాడో సూపరిండెంట్ గా కొనసాగుతున్న ఈ వైద్యుడు ఆసుపత్రిలోని కొన్ని వైద్య పరికరాలను తన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి…. ఎం జీ ఎం లోని విలువైన వస్తువులన్నీ ఈ డాక్టర్ ఇంట్లోనే ఉన్నట్లు ఆసుపత్రిలో గుసగుసలు వినిపిస్తున్నాయి…. ఇది ఇలా ఉంటే ఎంజీఎం లో టెండర్ దక్కించుకుని సానిటేషన్, సెక్యూరిటీ ,పేషంట్ కేర్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తన కులానికి చెందినవాడు కావడంతో బాగా సహకరిస్తున్నాడని తెలిసింది… అరకొర సిబ్బందిని నియమించిన ఫుల్లుగా బిల్లు మంజూరి చేయించడంలో ఈ షాడో సూపరిండెంట్ బాగా సహకరించినట్లు తెలిసింది… ఇతగాడు చెప్పినట్లు బిల్లు మంజూరి కోసం ఎంజీఎం అధికారులు సంతకాలు చేసినట్లు సమాచారం … కాగా ఈ షాడో సూపరిండెంట్ కు ఓ ఎమ్మెల్యే బంధువు కావడంతో ఎంజీఎం లో ఎవరిని లెక్కచేయని తనంతో ఉంటున్నట్లు తెలిసింది…మరి ఇంతలా ఇంచార్జ్ సూపరిండెంట్ ను సైతం పక్కన పెట్టి తన పెత్తనం కొనసాగిస్తున్న ఈ షాడో సూపరిండెంట్ పై వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఆనవసరపు పెత్తనానికి చెక్ పెడతారా… లేదా వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here