నాన్ లే ఔట్ కింగ్…?

ఆ పిఏసీఎస్ డైరెక్టర్ అనుమతులు లేని వెంచర్ లు చేయడంలో మహా స్పీడ్ గా దూసుకుపోతున్నాడు… అధికారాన్ని తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని వెంచర్ లు వేసి అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి… అనుమతులు లేని నాన్ లే అవుట్ వెంచర్ లతో ప్రభుత్వ ఆదాయానికి ఇతగాడు భారీగానే గండి కొడుతున్న అధికారులు మాత్రం వేడుక చూస్తున్నారు.

నాన్ లే ఔట్ కింగ్...?- news10.app

రియల్ మోసమే…?

గురువారం న్యూస్-10 పత్రికలో “పిఏసీఎస్ డైరెక్టర్ రియల్ మోసం” అనే కథనం తీవ్ర చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వంగపహాడ్ లో రికార్డు సరిగా లేని వెంచర్ చేసిన ఇతను నగరంలో మరిన్ని నాన్ లే అవుట్ వెంచర్ లు చేసినట్లు ఆధారాలు న్యూస్-10 నిఘా టీమ్ కు చిక్కాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంలో ఈ డైరెక్టర్ ను మించిన వారు ఎవరూ లేనట్లు ఇతను చేసిన వెంచర్ లు చూస్తే ఇట్టే అర్డంచేసుకోవచ్చు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ దగ్గర 1.34 గుంటల భూమిని కుడా అనుమతి లేకుండా 31 ప్లాట్లు గా చేసి అమ్మినట్లు విశ్వసనీయ సమాచారం. నగరంలోని రెడ్డిపురంలో కుడా అనుమతి పొందకుండానే వెంచర్ చేసి అందినకాడికి దండుకున్నాడట. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టడమే కాకుండా అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను ప్రజలకు మాయమాటలు చెప్పి అప్పనంగా దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో తోచిన ధరకు భూములను కొనుగోలు చేసి నాన్ లే అవుట్ వెంచర్ లు చేయడంలో కింగ్ అనిపించుకుంటున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here