కబ్జా చెరలో దళితుడి భూమి….?

అధికారుల్లో పరపతి ఉండి, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉంటే ఏదైనా చేయవచ్చనే దానికి ఈ కబ్జా వ్యవహారం నిజంగా ఓ బలమైన నిదర్శనం… అది అసైన్డ్ భూమి అయిన ప్రభుత్వ భూమి ఐయిన “దుడ్డు ఉన్నోడిదే బర్రె ” అన్న చందంగా ఎలా దక్కించుకోవడానికి ఎంతటి ప్రయత్నాలు చేస్తారో… విలువైన భూమి కనుక లకారల్లో పైసలు ఖర్చు చేసి అధికార బలగాన్ని, రాజకీయ బలాన్ని తమవైపు తిప్పుకుని కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలాంటి ఆధారాలు, సరైన డాక్యుమెంట్లు లేకున్న ఎంతటి సులువుగా కొట్టేస్తారో ఈ రావు గారి కబ్జా కహానీ వింటే చాలా ఈజీగా అర్థం అయిపోతుంది…. హన్మకొండ నగరం నడిబొడ్డున యాభై వేలకు పైగా విలువ చేసే ఓ దళితుడి 4 ఎకరాల అసైన్డ్ భూమిని హాంఫట్ అనిపించి అందులో 3 ఎకరాలను ఇప్పటికి నోటరీ ద్వారా పలువురికి విక్రయించి మిగిలిన ఎకరం భూమిలో భవంతి నిర్మాణానికి ఆ రావు సాబ్ ఉపక్రమించారు… ఇప్పటికే పిల్లర్లు నిర్మించిన ఆయన కేవలం రాత్రి వేలల్లో మాత్రమే పనులు నిర్వహిస్తూ ఇది తన భూమి కాదు అసైన్డ్ భూమి అని చెప్పకనే చెపుతున్నాడు…. భాదితులు న్యూస్10 కు తెలిపిన వివరాల ప్రకారం….

కబ్జా చెరలో దళితుడి భూమి....?- news10.app

ఇది కబ్జా కహానీ….

1949 వ సంవత్సరం లో భూమిలేని నిరుపేదగా గుర్తించి అప్పటి సర్కార్ వడ్డేపల్లి గ్రామంలో పొగుల మోజెస్ అనే దళితుడికి 3 ఎకరాల 17 గుంటల భూమిని కేటాయించింది… ఈ అసైన్డ్ భూమికి 1949- 1957 వరకు ఫస్లీ లావుని పట్టా కలిగి ఉండి పట్టేదార్ గా మోజెస్ కొనసాగారు…ఆతర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత అప్పుడున్న రెవెన్యూ నిబంధనల ప్రకారం 1963 లో మోజెస్ తన భూమిని పుస్కూరి రఘు కుమార్ విక్రహించారు… కాలక్రమేణా 1976 సంవత్సరం లో 376 సర్వే నంబర్ కాస్త 217,218,227 గా మార్చేశారు రెవెన్యూ అధికారులు … ఇక్కడికి బాగానే ఉన్నా అప్పట్లోనే అధికారులను ఏదొరకంగా మ్యానేజ్ చేసి భూమి తనదే అనిపించుకున్న విక్రయించారు కనుక మోజెస్ కుటుంబ సభ్యులు ఆ భూమి జోలికి ఏమాత్రం వెళ్ళలేదు…. కానీ ఇదే రఘు కుమార్ వేరే సర్వే నంబర్ లో మోజెస్ పేరుమీద ఉన్న 4 ఎకరాల అసైన్డ్ భూమి పై కన్నేసి సెట్ వార్, వసూల్ బాకీ రిజిస్ట్రార్ ను మ్యానేజ్ చేసి 227 సర్వే నంబర్ ను విభజించేసి దాన్ని 227/1,227/2,227/3 మార్పించేశాడు … 227/1 లో ఎకరం 31 గుంటలు, 227/2 లో ఎకరం 10 గుంటలు, 227/3 లో ఎకరం గా రికార్డుల్లో మారిపోయింది… దింతో రఘుకుమార్ కబ్జా వ్యవహారాన్ని తెలుసుకున్న మోజెస్ కుమారుడు పొగుల జయాకర్ జాన్సన్ ఆ ఆస్తికి వారసులం తామని ఆ భూమి తమ తండ్రి పేరుపై ఉందని స్థానిక తహసీల్దార్ కు అర్జీ పెట్టుకున్నాడు… దింతో సర్వే చేసిన అప్పటి తహసీల్దార్ రిజంక్షన్ ఆర్డర్ జారీచేస్తూ… అది ప్రభుత్వ భూమి కనుక ప్రబుత్వం స్వాధీనం చేసుకుంటుంది… లేదంటే అది ఎవరిపేరుపై వారికే చెందేలా చేస్తామని ఆర్డర్ లో స్పష్టంగా పేర్కొన్నారు… ఆర్డర్ ఇలా రాగానే అప్పటికే తీవ్ర కబ్జా ప్రయత్నం లో ఉన్న రఘు కుమార్ హైకోర్టు కు తప్పుడు సమాచారం ఇచ్చి తహసీల్దార్ కు తప్పుడు రికార్డ్స్ చూపించి తాను గిఫ్ట్ డీడ్ కింద చేసుకున్న సర్వే నంబర్ 227/3 కాకుండా దాని పక్కనే ఉన్న 227/2ను చూపించి అధికారులను మభ్యపెట్టి ఎల్ ఆర్ ఎస్ ద్వారా కుడా అనుమతి తీసుకున్నట్లు భాదితులు ఆరోపించారు… 227/3 లో మిగిలి ఉన్న ఎకరం భూమిని కొట్టేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లతో అందరిని సదరు రఘు కుమార్ పక్కదారి పట్టిస్తున్నట్లు వారు చెప్పారు…

ధరణిలో ప్రభుత్వ భూమి

227/3లో ఉన్న భూమి ఇప్పటికి ప్రభుత్వ అధికారిక పోర్టల్ ధరణిలో ప్రభుత్వ భూమేనని చూపుతుంది… అలాగే సర్వే ల్యాండ్ రికార్డ్స్ లో సైతం ప్రభుత్వ భూమి అని ఉంది కాని ఇవేమీ పట్టని కుడా అధికారులు, గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులు రఘుకుమార్ కు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు చకచకా ఇచ్చేసారు…

మింగేయాలనే స్కెచ్…

తన ఇష్టారీతిన ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించి 3 ఎకరాలు నోటరీ ద్వారా విక్రయించి ఇప్పుడు మిగిలిన ఉన్న ఎకరం సైతం మింగేయాలని చూస్తున్నట్లు భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…. హన్మకొండ కల్యాణి ఫంక్షన్ హల్ సమీపంలో ఉండే ఈ విలువైన భూమిని రఘుకుమార్ కు కట్టబెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది…పెద్ద పెద్ద దీని వెనకాల ఉన్నారని అధికారులే ఆప్ ది రికార్డ్ గా మాట్లాడడం ఇందుకు బలం చేకూరుతుంది. భూ వివాదం కోర్టులో ఉన్న విషయాన్ని సైతం ఏమాత్రం లెక్క చేయకుండా అధికారులు అడిగిన వెంటనే అనుమతులు అన్ని ఇవ్వడం ఇందుకు ప్రబల నిదర్శనం…

అసైన్డ్ భూమి కట్టబెట్టేందుకు ప్రజాప్రతినిధులు సహకారం…
ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు

10 లకారాలు పుచ్చుకున్న పదవిలో కొనసాగుతున్న ఓ మహిళ ప్రజాప్రతినిధి..?

గులాబీ పెద్ద బందువు మధ్యవర్తిత్వం…?

రేపటి సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here