పి ఏ సి ఎస్ డైరెక్టర్ రియల్ మోసం….?

హన్మకొండ జిల్లాలో రియల్ మోసాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. అరకొర అనుమతులతో వెంచర్ లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేస్తామని కల్లిబుల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే హసన్ పర్తి మండలం వంగపహడ్ లో ఓ పి ఏ సి ఎస్ డైరెక్టర్ రికార్డ్ కూడా సరిగ్గా లేని భూమి ని మ్యాపు మీద వెంచర్ చేసి అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది.

పి ఏ సి ఎస్ డైరెక్టర్ రియల్ మోసం....?- news10.app

అసలు విషయం ఏమిటంటే అతగాడు వెంచర్ చేసిన 19 గుంటల భూమిలో ఓ 5 గుంటలకు మాత్రమే రికార్డ్ ఉందట మిగిలిన 14 గుంటల భూమికి రికార్డ్ కూడా లేదని సమాచారం ఇలా రికార్డ్ సరిగా లేని ఈ భూమిలో 11 ప్లాట్లు చేసి గజానికి ఓ రేటు నిర్ణయించి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. వంగపహడ్ చుట్టుపక్కల రికార్డ్ లేని భూములను కొనుగోలు చేసి అమ్మడంలో ఈ పి ఏ సి ఎస్ డైరెక్టర్ ఆరితేరినవ్యక్తి అని హసన్ పర్తి మండలం వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here