ఇసుక మైనింగ్ కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇసుక మైనింగ్ కు గ్రీన్ సిగ్నల్ వేసింది. మంగళవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు నిర్మాణ పనులు వాయిదా పడగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి నిర్మాణ రంగానికి మినహాయింపును ఇచ్చింది. నిర్మాణాలకు ఇసుక అవసరం కనుక ఇసుక మైనింగ్ కు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

ఇసుక మైనింగ్ కు గ్రీన్ సిగ్నల్- news10.app