టవరెక్కిన ఉద్యమ కారుడు….

తెలంగాణను ఉద్యమం నుండి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని వివిధ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన టీఆరెస్ నాయకుడు దర్శన్ సింగ్ హన్మకొండలో సెల్ టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరుడిగా, అభిమానిగా పేరొందిన దర్శన్ సింగ్ తనకు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించినందుకు నిరసనగా ఆయన టవరెక్కి ఆందోళన చేసాడు… ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ… ఉద్యమ కాలం నుంచి కొనసాగుతున్న తనను కాదని 9వ డివిజన్ లో వేరే వ్యక్తికి బి పామ్ ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు… ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఉద్యమకారులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు… దర్శన్ సింగ్ సెల్ టవారెక్కి నిరసన వ్యక్తం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

టవరెక్కిన ఉద్యమ కారుడు....- news10.app