మహిళ జర్నలిస్టు ప్రాణం తీసిన కరోనా రక్కసి….

కరోనా రక్కసి మహిళా జర్నలిస్టు ప్రాణం తీసింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి కేంద్రంగా గత 8 ఏండ్లుగా “బతుకమ్మ” కేబుల్ టీవి ప్రసారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆ ఛానెల్ నిర్వాహకురాలు కల్పన(40) బుధవారం సాయంత్రం ప్రాణం కోల్పోయింది. 5 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటీవ్ రాగా, ఇంట్లోనే వైద్యం ప్రారంభించింది. అయితే నిన్న ఆమె ఆక్సిజన్ లేవల్స్ 85కు పడిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రమంతాపూర్లో ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆమె ఆకస్మిక మృతి పట్ల టీయూడబ్ల్యూజే పక్షానా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు.

మహిళ జర్నలిస్టు ప్రాణం తీసిన కరోనా రక్కసి....- news10.app