ఆ ఆసుపత్రికి మున్సిపల్ అనుమతి ఎలా…..?

ఉలుకు, పలుకు లేని మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

హన్మకొండ నగరం నడిబొడ్డున కేవలం నలభై గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి ఆసుపత్రికి అనువుగాని చోట అసలు ఆసుపత్రి ఉండరాని చోట ఆసుపత్రిని నడుపుతూ ఆర్థరైటిస్, రుమటిజం ఆసుపత్రి యాజమాన్యం అధికారులకే సవాల్ విసురుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న శాశ్వత అనుమతులు మంజూరు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అసలు ఎందుకు ఈ ఆసుపత్రికి గుడ్డిగా అనుమతులు ఇచ్చారో వారికే తెలియాలి. ఇక అసలు మున్సిపల్ అధికారులు ఈ భవనానికి ఏ పేరుతో ఎలా అనుమతులు ఇచ్చారో తెలియాల్సిఉంది.కేవలం భవనాన్ని రోడ్డుపై నుంచి చూస్తేనే ఇది ఆసుపత్రికి క్షేమకరం కాదు అని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మాత్రం ఈ భవనం ఆస్పత్రికి పనికివస్తుందని ఎలా తోచిందో వారికే తెలియాలి.ఇలా అనుమతులు మంజూరు చేసి ఇప్పడు ఇది ఆసుపత్రికి ఎలా పనికి వస్తుందని ప్రశ్నిస్తే అధికారులనుంచి సమాధానం లేకుండా పోయింది.ఈ ఆసుపత్రి నిర్వహణపై వారు ప్రస్తుతం కిమ్మనడం లేదు.

ఆ ఆసుపత్రికి మున్సిపల్ అనుమతి ఎలా.....?- news10.app

అసలు దేనికోసం ఈ భవనం…?

పట్టుమని 40 గజాలు లేని భూమిలో 4 అంతస్తుల భవనం అందులో ఆసుపత్రి చుట్టూ కమర్షియల్ దుకాణాలు అసలు ఆ బిల్డింగ్ దేనికోసం కట్టారు..? అసలు ఆ ఆసుపత్రి యజమాన్యం బిల్డింగ్ అనుమతులు మున్సిపల్ కార్పోరేషన్ నుండి దేనికోసమని తీసుకుంది..

ఇంటి కోసమా ,కమర్షియల్ కాంప్లెక్స్ కోసమా, ఆసుపత్రి కోసమా అనేది తెలియాల్సి ఉంది. అసలు 40 గజాల స్థలంలో 4 అంతస్థుల నిర్మాణ అనుమతులు ఎలా సాధ్యం…? ఇక్కడ ఆసుపత్రి నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారా ? ఇస్తే ఎలా ఇచ్చారు…? అందులో ఆసుపత్రి నిర్వహించవచ్చా..? ఎలాంటి రక్షణ ప్రమాణాలు పాటించకుండా ఫైర్ సేఫ్టీ , పార్కింగ్ లేకుండా ఎలా అనుమతులు ఇచ్చారో మున్సిపల్ అధికారులకే తెలియాలి …ఆ హాస్పిటల్ కు పర్మినెంట్ అనుమతులు ఇచ్చేముందు డిఎంహెచ్ఓ పూర్తిగా ఆ బిల్డింగ్ పరిశీలించారా ఫైర్ సేఫ్టీ కనపడిందా ,పార్కింగ్ ప్లేస్ ఉందా ఏదయినా అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి ఆ బిల్డింగ్ చుట్టూ స్థలం కనపడుతుందా…? ఆసుపత్రిలో నుండి బయటికొస్తే మెయిన్ రోడ్ ఉంది మరి రోగుల ప్రాణాలకు ప్రమాదమే అనే విషయాన్ని వైద్యాధికారులు ఎందుకు గుర్తించలేదు… అన్ని తెలిసి ఎలా పర్మినెంట్ అనుమతులు ఇచ్చారో జిల్లా డిఎంహెచ్ఓ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో భవనాన్ని పరిశీలించి ఆసుపత్రి అనుమతులు రద్దు చేస్తారో లేదో చూడాలి…

ఆసుపత్రి ఇచ్చిన పత్రాలను పునాః పరిశీలిస్తాం….

లలితాదేవి, హన్మకొండ డిఎంహెచ్ఓ

నరేష్ ఆర్థరైటిస్ & రుమటిజం హాస్పిటల్ పర్మినెంట్ అనుమతులు పొందే క్రమంలో ఆ ఆసుపత్రి యాజమాన్యం సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలిస్తున్నాం… పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటాం.

నాకేం తెలియదు సిటీ ప్లానర్ కే తెలుసు…

మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఖాజీపేట సర్కిల్

గ్రేటర్ వరంగల్ పరిధిలో ని లష్కర్ బజార్ లో ఉన్న నరేష్ ఆర్థరైటిస్&రుమటిజం ఆసుపత్రి బిల్డింగ్ అనుమతులు దేనికోసం ఇచ్చారు ఆసుపత్రికా, ఇంటి కోసమా అని న్యూస్-10 ప్రతినిధి డిప్యూటీ కమిషనర్ (కాజిపేట సర్కిల్) వివరణ కోరగా తనకేం తెలియదని ,సిటీ ప్లానర్ కే తెలుసని అన్నారు. కాగా వివరణ కోసం న్యూస్10 ప్రతినిధి సిటీ ప్లానర్ కు ఫోన్ చేయగా ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here