మనుషులా… రాక్షసులా?

అనుమానం పెనుభూతంగా మారింది… తమ బందువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అనే అనుమానంతో ఓ డిగ్రీ విద్యార్థిని అమ్మాయి తరపు బంధువులు విచక్షణారహితంగా చితకబాదారు… ఒళ్ళంతా గాయాలు చేసి రాక్షసానందం పొందారు… అబ్బాయిని పథకం ప్రకారం రప్పించి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి తాళ్లతో కాళ్ళు, చేతులు కట్టివేసి కదలకుండా రోజంతా బంధించి చావబాదారు… ఇది చాలదన్నట్లు తామేదో ఘనకార్యం, లోక కళ్యాణార్థం మంచి పని చేస్తున్నట్లు ఆ అబ్బాయిని చితకబాదుతూ ఫోటోలు , వీడియోలు తీసి ఎలా చితకబాదుతున్నామో చూడండి అంటూ వారి మిత్రులకు వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలు సెండ్ చేసి మరి వారు వికృత రాక్షసానందాన్ని పొందారట… ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు త్రినగరి లోని ఖాజీపేటలో జరిగింది…..

తీవ్రగాయాల పాలయిన విద్యార్థి తండ్రి బైరపాక ప్రభుదాస్ న్యూస్10 కు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ప్రభుదాస్ తన కుటుంబం తో కలిసి కాజీపేట డీజిల్ కాలనిలో ఓ కిరాయి ఇంట్లో ఉండేవాడు… వీరు కిరాయికి ఉంటున్న ఇంటి యజమాని కూతురు తో ప్రభుదాస్ కుమారుడు డిగ్రీ చదువుతున్న బైరపాక ప్రసాద్ కాస్త స్నేహంగా ఉండేవాడు .తరుచుగా మాట్లాడుతూ ఉండేవాడు దింతో ప్రసాద్ పై అమ్మాయి తల్లిదండ్రులకు అనుమానం కలిగింది… అనుమానం కాస్త పెనుభూతంగా మారి తరుచుగా మాట్లాడుతున్నాడు కనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉండొచ్చని వారు బలంగా నమ్మారు. ఇంకేముంది బంధువులు రంగంలోకి దిగారు. తన మరదలి కూతురుతోనే తిరుగుతావ అంటూ కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన రియలేస్టేట్ వ్యాపారి మాచర్ల శేఖర్ అతని కుమారులు అభినయ్, అఖిల్, అతని బావమరిది గాజుల సదానందం లు కలిసి అమ్మాయితో ఫోన్ చేయించి అబ్బాయిని రప్పించి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి తాళ్లతో కాళ్ళు, చేతులు కట్టివేసి ఇష్టం ఉన్నట్లు చావబాదారు.కాల్లవేళ్ళ పడి బ్రతిమిలాడిన వినకుండా ఒళ్ళంతా తీవ్రగాయాలు చేశారు. చితకబాదుతున్నా ఫోటోలు తీసి వారి మిత్రులకు పంపించగా సామాజికమాద్యమాలలో చూసిన అబ్బాయి తల్లిదండ్రులు విలపిస్తు బంధించిన చోటకు వెళ్లగా మరోసారి అమ్మాయితో మాట్లాడమని కాగితం రాసి సంతకం పెడితేనే అబ్బయిని వదులుతామని కనీసం తల్లిదండ్రులకు ఆ అబ్బయి మొహం కూడా చూపకుండా వారు రాక్షసుల్ల ప్రవర్తించినట్లు ప్రభుదాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

హుటాహుటిన ఎంజీఎం కు…

తీవ్రగాయలపాలయిన తన కుమారుడిని తీసుకొని ప్రభుదాస్ చికిత్స కోసం ఎంజీఎం వెళ్లారు. ప్రస్తుతం గాయాల పాలయిన విద్యార్థి ప్రసాద్ ఎంజీఎం లో చికిత్స పొందుతున్నాడు.ప్రస్తుతం ఆరోగ్యం కాస్త కుదుటపడ్డ ఇంకో రెండు రోజులు గడిస్తే తప్ప ఏంచెప్పలేమని వైద్యులు చెప్పినట్లు ప్రభుదాస్ న్యూస్10 కు తెలిపారు. తీవ్రంగా కొట్టడంతో కిడ్నీలు దెబ్బతినగా ప్రస్తుతం మూత్రం పోయడం సమస్యగా మారిందన్నారు.

పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు…

తన కొడుకును అకారణంగా అనుమానంతో తీవ్రంగా కొట్టి గాయపరిచారని విద్యార్థి ప్రసాద్ తండ్రి ప్రభుదాస్ కాజీపేట పోలీస్ స్టేషన్లో శేఖర్ అతని కుమారులు,బావమరిది పై ఫిర్యాదు చేశారు. పిర్యాదు నందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.వారు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here