బంగారం వెనుక బడా నేతలు……?

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి గుప్తనిది విషయం రోజురోజుకో మలుపు తిరుగుతుంది. కేవలం వెండి నాణాలు మాత్రమే లభ్యం ఐయాయి వాటిని రికవరీ చేసాం అంటూ పోలీసులు మీడియాకు ఓ ప్రెస్ నోట్ పంపి చేతులు దులుపుకోగా ఆ తవ్వకంలోబయటపడ్డ బంగారం 150 కిలోలు అని కొందరు కాదు కాదు మూడు క్వింటాళ్లు అని ఇంకొందరు పక్కాగా చెపుతున్నారు. దీనికి తోడు గుప్తనిది ని వెలికితీయడంలో సహకరించిన కొంతమంది వ్యక్తుల ఆడియో సంభాషణ సామాజిక మాధ్యమాలలో వైరల్ కాగా ఈ తవ్వకాల్లో నిజంగానే బంగారం బయటపడినట్లు తెలుస్తుంది.నిధి బయటకు కనపడే వరకు అందరిని కలుపుకొని పోయి నిధి కనపడగానే కొందరిని తప్పించి అక్కడనుంచి నిధిని తరలీయడంతో అసలు విషయం బయటకు పొక్కినట్లు తెలుస్తుంది.మూడు వందల క్వింటాళ్లు గా చెపుతున్న బంగారం గుట్టు చప్పుడు కాకుండా తరలిపోవడానికి కొంతమంది బడా రాజకీయ నేతలు సహకరించినట్లుగా తెలుస్తుంది. వందలకోట్ల రూపాయల బంగారం విషయంలో కలుగజేసుకున్న వీరు అన్ని రకాలుగా అందరిని మ్యానేజ్ చేసి విషయం బయటకు రాకుండా కథ నడిపి రాగి నాణాలతో విషయాన్ని పక్కదారి పట్టించారని, ఇందుకు గాను వాటాలు బాగానే పుచ్చుకొని గుప్త నిధి కథ సుఖాంతం చేసేందుకు ప్రయత్నం చేశారని తెలుస్తుంది.వీరి డైరెక్షన్ లోనే గుప్తనిది కథ ఇప్పటికి కొనసాగుతుందని సమాచారం.ఇదిలావుండగా గుప్తనిది లో ఖచ్చితంగా మూడు వందల క్వింటాళ్లు బంగారు నాణాలు లభ్యం ఐయాయని గుప్తనిది వెలికితీయడంలో సహకరించి ఆతర్వాత తప్పించిన వ్యక్తి ఖాయంగా చెపుతున్నారు. ఈవిషయం తనకు తెలుసు కనుక తనను నెక్కొండకు చెందిన పూజారి,ఇతరులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు.

బంగారం వెనుక బడా నేతలు......?- news10.app

స్థానిక పోలీస్ అధికారి పాత్ర…?

బంగారం విషయం బయటకు రాకుండా రాగి నాణేలతో సరిపెట్టి ఇంత జరిగినా కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా గుప్తనిది విషయాన్ని పక్కదారి పట్టించడంలో స్థానిక పోలీస్ అధికారి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయాన్ని పక్కదారి పట్టించి సహకరీంచినందుకు భారీగానే నజరానా అందిందని ఆ విషయం ఆ బడా నేతలే చూసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది… మరో వైపు ఈ గుప్తనిది విషయంలో గంగదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనికి సంబందించిన వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా సర్పంచ్ దర్జాగా మండల కేంద్రంలో తిరుగుతున్నాడని తెలుస్తోంది.పోలీసులు ఇతనిపై అసలు కేసు నమోదు చేసినట్ల లేదా …?. అని కొందరు ప్రశ్నిస్తున్నారు.వాహనాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే అప్పగించారని ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇంతగా ప్రచారం జరుగుతున్న గుప్తనిది తవ్వకాల్లో పాలు పంచుకున్న కొందరు పక్కాగా బంగారం భారీగా దొరికిందని చెపుతున్న ఇప్పటివరకు పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు ఆదిశగా విచారణ జరిపిన దాఖలాలు ఏవి కనిపించడం లేదు.రాగి నాణాలు దొరికాయని మీడియాకు ప్రెస్ నోట్ పంపిన పోలీసులు వేరే కోణంలో దర్యాప్తు జరిపేల లేరని తెలుస్తుంది. ఈ గుప్తనిది విషయంలో బాగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు ఉండడం వల్ల పోలీసులు దీన్ని ఇంతటితో ముగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో పోలీస్ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here