డబుల్ మోసం..

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో దళారులు చేరి సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వరంగల్ త్రినగరిలో డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని కొందరు అందినకాడికి దండుకుంటు డబుల్ బెడ్రూం ఆశావహులకు చుక్కలు చూపెడుతున్నారు. డబుల్ బెడ్ రూం వస్తుందన్న ఆశతో డబ్బులు సమర్పించి ఇటు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక అటు డబుల్ బెడ్ రూం రాక సామాన్యులు నానా తిప్పలు పడుతున్నారు.

డబుల్ మోసం..- news10.app

లక్షలు వసూల్ చేసిన మహిళ…?

గృహ నిర్మాణ శాఖ లో తనకు తెలిసిన వారు ఉన్నారు చాలా సులువుగా డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హన్మకొండ కు చెందిన ఓ మహిళ లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది.డబుల్ బెడ్ రూం కావాలని తన వద్దకు వెళ్లినవారి స్థాయిని బట్టి యాబై వేల నుంచి రెండు లక్షల వరకు ఈ మహిళ వసూల్ చేసి సామాన్యులను తన చుట్టూ తిప్పుకుంటున్నట్లు తెలిసింది. తిరిగి తిరిగి వేసారి పోయిన వారు డబుల్ బెడ్ రూమ్ వద్దు మా డబ్బులు మాకు ఇవ్వాలని హన్మకొండలోని ఆ మహిళ ఇంటికి వెళ్లి నిలదీయగా డబ్బులు ఇస్తానని నమ్మబలికి వాయిదా పెట్టినట్లు తెలిసింది.

వసూళ్ల వెనుక ఏ ఈ…?

గతంలో గృహనిర్మాణ శాఖలో వరంగల్ లో ఏ ఈ గా పనిచేసి ప్రస్తుతం ఇటీవలే హైదరాబాద్ కు బదిలీ ఐయిన ఓ ఉద్యోగి డబుల్ బెడ్ రూం లు ఇప్పిస్తామని హన్మకొండ కు చెందిన మహిళ ద్వారా వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఆ ఏ ఈ మహిళకు దగ్గరి బంధువు కావడంతో వసూళ్లు బాగానే చేసినట్లు.తెలిసింది. డబ్బులు ఇచ్చిన బాధితులు ఈ విషయమై సుబేదారి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా సదరు ఏ ఈ పై కేసు సైతం నమోదు అయినట్లు తెలిసింది.కాగా డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో ఇదే తరహా దందా వరంగల్ నగరంలో నడుస్తున్నట్లు తెలిసింది … గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కేంద్రంగా కొంతమంది లక్షల్లో వసూలు చేసినట్లు తెలిసింది.వివివిధ సంఘాల్లో పనిచేసే కొందరు మహిళలు డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని తమకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని నమ్మించి డబ్బులు వసూలు చేసి సామాన్యులను తమ చుట్టూ తిప్పుకుంటున్నట్లు సమాచారం.గతంలో కార్పొరేషన్ పనిచేసిన ఓ ఉద్యోగి పేరుతో వసూళ్లకు పాల్పడిన వీరు ఇప్పటికి తీసుకున్న డబ్బులు బాధితులకు చెల్లించలేదని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here