ఆ సిఐ కి ముట్టిందెంత…?

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామం లో గుప్తనిధుల వ్యవహారం విషయంలో స్థానిక సిఐ పై అనేక విమర్శలు వెలువడుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల సలహా మేరకు సిఐ గుప్తనిధిలో లభించింది బంగారం అని తెలిసినా చూసిచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.. మరోవైపు గుప్తనిదికోసం తవ్వకాలు జరిపిన తర్వాత అందులో ఉన్నది బంగారం అని తెలియగానే నిధి తవ్విన వ్యక్తులు కొందరు ప్రజాప్రతినిధుల సహకారం కోరగానే సదరు ప్రజాప్రతినిధులు. ముందుగా ఆ సిఐ దృష్టికి విషయం తీసుకువెళ్లి సహాకారం కోరినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధుల సలహమేరకు రాగినాణాలు దొరికినట్లు .మీడియాకు ఓ నోట్ విడుదల చేసి సిఐ చేతులుదులుపుకున్నట్లు తెలిసింది.ఈ విషయమై కొందరు జర్నలిస్టులు ప్రశ్నిస్తే ప్రెస్ నోట్ పంపాము కదా అని సిఐ. ముక్తసరిగా సమాధానం ఇవ్వడం, కేసు నమోదు విషయంలో ఎఫ్ ఐ ఆర్ కాపీ కావాలని అడిగితే ఇచ్చేది లేదు కావాలంటే కోర్టు నుంచి తీసుకోవాలని ఓ జర్నలిస్ట్ కు సిఐ సమాధానం చెప్పడం గుప్తనిది విషయంలో విషయాలు తెలియకుండా ఆ సిఐ చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది.

ఆ సిఐ కి ముట్టిందెంత...?- news10.app

భారీ నజరానా….?

గుప్తనిది విషయంలో దొరికిన బంగారం సర్కార్ చేతికి చిక్కకుండ మండలం దాటి కావాల్సిన చోటికి చేరుకునేలా తన శాయశక్తులా సిఐ సహకరించాడని ఆరోపణలు వస్తుండగా ఇందుకుగాను గుప్తనిది తవ్విన వ్యక్తులనుంచి సిఐ 25 లక్షల నజరానా అందుకున్నట్లు టాక్ వినపడుతుంది. దీనికి సంబంధించి ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది…. సార్ కు ఇవ్వడానికి చెక్ ఇచ్చామని ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

డిమాండ్ పెరిగింది…?

గుప్తనిది విషయంలో పోలీస్ అధికారి 25 లక్షల రూపాయల భారీ నజరానా అందుకున్నారని ప్రచారం జరుగుతుండగా మరోవైపు బంగారం భారీగా బయటపడిందని తెలిసిన సిఐ మరికొంత డబ్బు కావాలని గుప్తనిది తవ్విన వారిని డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినపడుతున్నాయి… సిఐ టార్గెట్ భారీగానే ఉందని గ్రామంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. క్వింటాళ్ల కొద్దీ బంగారం అని తీసినప్పటినుంచి ఆ సిఐ తనకు భారీ మొత్తంలో ముట్టజెప్పాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో బంగారం విషయంలో కలుగజేసుకున్న కొందరు రాజకీయ నాయకులతో సైతం సిఐ తన భారీ నజరానా విషయంలో మాట్లాడినట్లు గ్రామంలో చర్చ సాగుతోంది. మరోవైపు గుప్తనిది విషయంలో ఓ సర్పంచ్ ను కేసు నుంచి తప్పించేందుకు సిఐ ప్రయత్నం చేస్తున్నారని రాగి నాణాలు దొరికినపుడు సర్పంచ్ కు సంబందించిన కార్ దొరికిన సిఐ కేసు కాకుండా చూసాడని కొందరు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి గుప్తనిది వ్యవహారంలో స్థానిక సిఐ రాజకీయ నాయకుల జోక్యంతో తవ్వకాలు జరిపినవారికి పూర్తిగా సహకరించారని, పోలీస్ ఉన్నతాధికారులను సైతం పక్కదారి పట్టించి రాగి నాణాల కథ తో కేసుకు ముగింపు పలికారని ఈ విషయంలో లోతుగా విచారణ జరిపితే అసలు విషయాలు బయటపడుతాయని స్థానికులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here