ప్రాణం ఉన్నంతవరకు బీజేపీలో చేరను….. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

నాప్రాణం ఉన్నంత వరకు నేను బిజెపి పార్టీలో చేరనని, కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ లోనే, కొనసాగుతాను అంటూ, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరి తెలిపారు. తాను త్వరలో పార్టీ మారి, బిజెపిలో చేరుతాను, అంటూ వస్తున్నా, వార్తలు పూర్తిగా నిరాధారమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, తాను పూర్తి స్థాయిగా, విశ్వసిస్తున్న తాను ఎందుకు పార్టీ మారుతానంటూ, అని తెలిపారు. ఆయన తనకు ఎన్నో అవకాశాలు కల్పించాలని, కెసిఆర్ , కేటీఆర్ నాయకత్వంలోని తాను పని చేస్తానని తెలిపారు.

ప్రాణం ఉన్నంతవరకు బీజేపీలో చేరను..... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి- news10.app

హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాహిత్యంతో జల వివాదాలను సృష్టిస్తున్నారు అంటూ, విమర్శించారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల హక్కులను హరించే ధోరణి జగన్మోహన్రెడ్డి మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణ జల దోపిడికి పాల్పడితే సహించేది లేదు అంటూ, హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో తప్పు విధానాలను పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నారని విమర్శించారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించడమే కాకుండా, జిల్లా వివాదాలకు పాల్పడుతున్న , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నివారించడంలో వైఫల్యం చెందుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన హక్కుల సాధన కోసమే ఉద్యమం ఇస్తుంది అని, అంటూ ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన జల దోపిడీ, నియంత్రించుకోవాలి అంటూ, ఆయన హెచ్చరించారు. అనంతరం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం, విలేకరులతో కాసేపు చిట్ చాట్ చేశారు. మంత్రి పదవులు చేపట్టారు, ఉపముఖ్యమంత్రి చేపట్టారు, తర్వాత రాష్ట్రంలో పేరున్న నాయకులుగా చలామణి అవుతున్న కడియం శ్రీహరి, మీరు మీ ఎమ్మెల్సీ పదవి కోసమే ఈటెల రాజేందర్ విమర్శిస్తున్నారు అంటే, మీ సమాధానం, అంటూహక్కులను(10 ) ప్రతినిధి సాయి ప్రదీప్ ప్రశ్నించగా, ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, తానెప్పుడూ పదవులు ఆశించే లేదని, బిజెపి పార్టీ లో పోతారు అన్న ప్రశ్నకు తాను, కంఠంలో ప్రాణం ఉండగా పోను అంటూ ఆయన తెలిపారు.

తానెప్పుడూ కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని ఆయన తెలిపారు. మీరు టిడిపిలో ఉన్నప్పుడు, కెసిఆర్ ను, కేటీఆర్, హరీష్ రావు ను, కాలిగోటితో సమానం, అని వరంగల్ ప్రెస్క్లబ్లో మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ కెసిఆర్, బాహుబలి, కేటీఆర్ ఏ ముఖ్యమంత్రి గా కనిపిస్తున్నారు అంటే, దీనికి అర్థం ఏంటి ,మాటలు మార్చడంలో మీరు అగ్రగణ్యులు కాదా అంటే సమాధానం.. బ్రదర్ నేను ఎప్పుడూ పార్టీలు మారను. నేనెప్పుడూ పదవులు ఆశించలేదు.. నిష్పక్షపాతంగా పనిచేసినా పనితీరే, నా పదోన్నతులకు రావడానికి కారణమని తెలిపారు.