నిజాయితీగా ప్రజలకు సేవలందించాలి.. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

ప్రజలకు నిజాయితీగా సేవలందించి వారి అభిమానాన్ని పోందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు.

నిజాయితీగా ప్రజలకు సేవలందించాలి.. వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి- news10.app

అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ల నుండి సబ్-ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు అందజేసారు. ఈ సందర్భంగా ఎస్ఐలుగా పదోన్నతి పొందిన పి. జంపయ్య, పి.రాజిరెడ్డి, యం.డి ఆహ్మదుల్లా, సి.హెచ్. శ్రీనివాస్ రెడ్డి, షాఖాన్, ఎ.సారమల్లు, జె.ఎలీషా, ఎస్. ఇమ్మాన్యుల్,జె. మనోహర్ రాజ్, ఇంద్రయ్య, నరసింహరావులను పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ పదోన్నతి పోందిన అధికారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ, ప్రజలు మనపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై వుందని. మనం నిర్వహించే విధులపై పోలీస్ శాఖ మర్యాదలు ఆధారపడి వుంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమములో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.