తూర్పులో కమల వికాసమేన….?

ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు ప్రజారాజ్యం పార్టీలో కేవలం మూడు వేల ఐదు వందల ఓట్ల తేడాతో విజయానికి దూరం ఐయిన ఆయన అప్పటినుంచి నియోజకవర్గాన్ని ఏమాత్రం వదిలి పెట్టకుండా జనం మధ్యనే ఉన్న వ్యక్తిగా తూర్పులో మంచి పేరున్న వ్యక్తిగా చెపుతుంటారు…

వివాద రహితుడిగా మాస్, యూత్ లో బాగా పాలోయింగ్ ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు గులాబీని వదిలి కమల తీర్థం పుచ్చుకోగానే తూర్పులో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి…. కమలం ఈ నియోజకవర్గంలో బాగా పుంజుకుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కమల మరింతగా వికసిస్తుండగా రానున్న ఎన్నికల్లో కమలం, గులాబీ మద్యే ప్రధాన పోటీ ఉండబోతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు…. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ నిత్యం అందరిని కలుస్తూ తనవైపు తిప్పుకుంటు తన నాయకత్వ లక్షణాలను పూర్తిగా వినియోగిస్తున్న ప్రదీప్ రావు పట్ల తూర్పు నియోజకవర్గ ప్రజల్లో అంచనాలు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది.

తూర్పులో కమల వికాసమేన....?- news10.app

ఇదే ఊపు ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే తూర్పులో కమల వికాసం ఖాయంగా కనిపిస్తుందని నియోజకవర్గంలో టాక్ బాగానే వినిపిస్తుంది… గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గం జనం మధ్యనే ఉంటూ తూర్పులోని దాదాపు అన్ని డివిజన్లలో అనుచరులను కలిగివున్న ఎర్రబెల్లి తన ఆ అనుచరుల ద్వారా ఇప్పటికే పలు దఫాలుగా డివిజన్ లోని ప్రజలతో మమేకం అవుతూ తరుచుగా డివిజన్ లల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటు వారికి మరింతగా దగ్గరవుతున్నట్లు తెలిసింది…. మొన్నటివరకు అధికార పార్టీలో కొనసాగిన ఆయన కమలంలో చేరగానే పార్టీని మరింతగా బలోపేతం చేసినట్లు కొందరు బీజేపీ నాయకులే చెపుతున్నారు…. అంతేకాదు ఇంకొంతమంది నాయకులు ఓ అడుగు ముందుకేసి ఉమ్మడి వరంగల్.జిల్లాలోనే ముందుగా కమలం విజయం సాధించే స్థానం వరంగల్ తూర్పు నియోజకవర్గమేనని చర్చించుకుంటున్నారు…. అంతేకాదు వ్యక్తిగతంగా మంచి పేరున్న వ్యక్తిగా, తూర్పులో మంచి పాలోయింగ్ ఉన్న వ్యక్తిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను గుర్తించిన బీజేపీ అధిష్టానం టికెట్ సైతం ఎప్పుడో ఖరారు చేసిందని కొందరు బీజేపీ నాయకులు ఆప్ ది రికార్డ్ గా చెపుతున్నారు.

పార్టీ నిబంధనల మేరకు ఇప్పటికి ఎవరికి టికెట్ ఖరారు చేసినట్లు బహిరంగంగా వెల్లడించడం లేదు కాని ప్రదీప్ రావు కు ఎప్పుడో తూర్పు టికెట్ ఖరారు ఐనట్లేనని ఆయనకు నియోజకవర్గంలో ఉన్న పాలోయింగ్ పట్ల పార్టీ అధిష్టానం సైతం పూర్తి సంతృప్తిగా ఉందని ఆయన అనుచరులు అంటున్నారు… వరంగల్ తూర్పులో కమల వికాసం ద్వారా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జైత్రయాత్ర మొదలవుతుందని ఆయన అనుచరులు పూర్తి ధీమా వ్యక్తంచేస్తున్నారు… తూర్పులో బి ఆర్ ఎస్ కు ప్రత్యమ్నాయం తామేనని వారు అంటున్నారు…. ఎర్రబెల్లి రాకతో తూర్పులో గులాబీపై కమలానీదే విజయమని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు…. మొత్తానికి వరంగల్ తూర్పులో తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు రానున్న ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటినుంచే తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది…. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎలాంటి విరామం లేకుండా అందరిని కలుస్తూ కలుపుకుపోతూ తన విజయం కోసం మంచి వ్యూహ రచనే చేసుకున్నట్లు తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here