కాంతమ్మ దందా….!

నిరుద్యోగుల ఉద్యోగ అవసరాన్ని ఆసరా చేసుకొని మోసం చేయడం కొన్ని ఉద్యోగ ఎజెన్సిలకు అలవాటుగా మారింది… ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఇలాంటివారి భరతం పోలీసులు పట్టిన భయం లేకుండా పోతుంది…తాజాగా ఓ ఏజెన్సీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగుల నెత్తిన శఠగోపం పెట్టింది… అందినకాడికి దండుకొని ఉద్యోగం ఇప్పించకపోగా తమ డబ్బులు తమకు ఇవ్వాలని నిరుద్యోగులు అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని ఓసారి ఇస్తామని మరోసారి చెపుతూ… కాలయాపన చేస్తూ భాదితులు పదే పదే తమ డబ్బుల గూర్చి అడిగితే సూసైడ్ చేసుకుంటానని భాదితులనే బెదిరిస్తుందట ఓ ఏజెన్సీ నిర్వాహకురాలు….కాంతమ్మ ప్లేస్మెంట్ అండ్ ఔట్ సోర్సింగ్ సొసైటీ పేరుతో తమకు గురుకుల కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎలా మోసం చేశారో భాదితులు న్యూస్10 కు వెల్లడించిన వివరాల ప్రకారం…

ఇలా బురిడీ కొట్టించారు

కాంతమ్మ ప్లేస్మెంట్ అండ్ ఔట్ సోర్సింగ్ సొసైటీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ నిర్వాహకురాలిని నేనేనంటు జీడీ మాధురి అనే మహిళ నిరుద్యోగుల వద్దనుంచి తనకు తోచినంత వసూలు చేసింది… ప్రకాంతమ్మ దందా....!- news10.appభుత్వ గురుకుల కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన సదరు మహిళ మరో మహిళ దగ్గర మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది…ఇక గురుకుల కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ కొలువు వచ్చినట్లే చెప్పి బాధితురాలిని హన్మకొండ లోని ఆర్ సి ఓ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడున్న సూపరిండెంట్ తో మాట్లాడం ఉద్యోగం పక్క అని చెప్పి మాయమాటలు చెప్పిందని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది…..ఉద్యోగం వచ్చినట్లుగా తనను నమ్మించడానికి ఏవో రిజిస్టర్ లు కొనుక్కోమని చెపితే తాను రిజిస్టర్ లు సైతం కొనుగోలు చేసినట్లు బాధితురాలు చెప్పింది…. ఏజెన్సీ నిర్వాహకురాలు మరో అడుగు ముందుకు వేసి తనకు ఉద్యోగం వచ్చిందని మరింతగా నమ్మించడానికి అపాయింట్ మెంట్ ఆర్డర్ అంటూ సొసైటీ లెటర్ ప్యాడ్ పై వారికి తోసింది రాసి తనను మోసం చేసారని అలాగే ఆర్ సి ఓ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం తాను జూనియర్ అసిస్టెంట్ ను అంటూ ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి ఈ నెల వేతనం బిల్ ఐయిందా అంటూ తమను ప్రశ్నించాడని తమకు ఇంకా ఉద్యోగమే రాలేదు అంటే ఫోన్ పెట్టేసారని ఇదంతా తమను నమ్మించడానికి తాము చెల్లించిన మూడు లక్షలు ఎగ్గొట్టడం కోసమే ఇలా చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది…కాగా ఉద్యోగం పేరుతో తమవద్దనుంచి మూడు లక్షలు దండుకొని ఉద్యోగం ఇప్పించకపోగా తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే తానే సూసైడ్ చేసుకుంటానని బెదిరింపులకు దిగుతుందని బాధితురాలు వాపోయింది….

భాదితులు చాలామందే

ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలను కాంతమ్మ సొసైటీ నిర్వాహకురాలు చాలామంది దగ్గరే వసూలు చేసినట్లు తెలిసింది…కొంతమంది కలిసి ఓ గ్రూప్ గా ఏర్పడి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు సమాచారం ఈ సొసైటీ వెనకాల కొందరు ప్రభుత్వ ఉద్యోగుల హస్తం సైతం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం…వీరే నిరుద్యోగులకు మాటలు చెపుతూ ఆర్భాటం ప్రదర్శిస్తూ డబ్బులు దండుకుంటున్నారని తెలిసింది…

ఆ సొసైటీ వెనక ఆర్ సి ఓ…..?

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here