గురుకుల టెండర్లలో ఓకేఒక్కడు

గురుకుల టెండర్లలో ఓ వ్యక్తి ఒకే ఒక్కడు గా తన హవాను కొనసాగిస్తున్నాడు… గురుకులాల్లో టెండర్లలో దూసుకుపోతూ తన పేరుతో తన బినామీ పేర్లతో హస్తగతం చేసుకొని తనకు ఏమాత్రం ఎదురులేదంటున్నాడు… ఈ రావు గారికి గురుకులాల ఆర్ సి ఓ తన పూర్తిసహకారం అందిస్తూ టెండర్ లు దక్కేలా చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.

గురుకుల టెండర్లలో ఓకేఒక్కడు- news10.app

గురుకులాల జోనల్ మీట్ లో నిబంధనలకు విరుద్ధంగా మీట్ నిర్వహణ టెండర్ సైతం సదరు రావు కే కట్టబెట్టిన ఆర్ సి ఓ రావుకు ఏ స్థాయి సహకారం అందిస్తున్నారో అర్థం అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి…. అంతే కాదు ఈ గురుకులాల టెండర్ లల్లో ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా ఉన్న మరో వ్యక్తి సైతం తన వ్యక్తిగత, బినామీ టెండర్ లతో దూసుకుపోతుండగా ఇయనగారికి సైతం ఆర్ సి ఓ నే సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు బాగానే వినిపిస్తున్నాయి….

టెండర్ లల్లో హవా కొనసాగిస్తున్న రావు గారు ఎవరు…?

వ్యక్తిగతంగా, బినామిలతో దూసుకుపోతున్న ఆరోగ్య శాఖ ఉద్యోగి ఎవరు…..?

వీరిద్దరికి గురుకులాల ఆర్ సి ఓ సహాకారం ఎందుకు….?

మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here