కేశవపట్నం వెంచర్ దందా…

ప్రస్తుతం ఉన్న రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడం తిరిగి వాటిని ప్లాట్లు గా చేసి 10 రెట్ల లాభం పొందడం ఇలా రియల్టర్ లు దినదినాభివృద్ది చెందుతున్నారు ఈ రంగంలో ఈ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కొందరు బడా వ్యాపారులు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం లో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాన్ని వెంచర్ పేరుతో 101 ప్లాట్లు గా చేసి అమ్మేశారంట విచిత్రం ఏమిటంటే ఆ భూమిలో కనీసం ప్లాట్లు కూడా చేయకుండా కేవలం పేపర్ మీద మాత్రమే మ్యాప్ చూపించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారట ఇప్పటికే 80శాతం ప్లాట్లు అమ్మినట్లు సమాచారం . జిల్లాలో అక్రమ వెంచర్ లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కనీస అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ లు అనేకం వెలుస్తున్నా యి. ఈ క్రమంలోనే జిల్లా లోని శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా కరీంనగర్ హైవే పక్కన కొంతమంది అక్రమంగా వెంచర్ వేసి అడ్డగోలుగా ప్లాట్ల విక్రయానికి తెరలేపడం అక్రమ వెంచర్ దందాకు అద్దం పడుతోంది..కనీస నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేసిన రియల్టర్లు ప్లాట్లు కూడా ఏర్పాటు చేయకుండా కేవలం వెంచర్ మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్ లు చేసినట్లు తెలిసింది.ఆరు ఎకరాల ముప్పై గుంటల్లో 101 ప్లాట్లు అని చెపుతున్న రియల్టర్ లు వెంచర్ లో ఎక్కడ రహదారులు కానీ డ్రైనేజీ కాని ఏర్పాటు చేయకుండా గజానికి ఏడు వేల చొప్పున ఇప్పటికే అనేక మందికి విక్రయించినట్లు సమాచారం. కేవలం సంపాదనే ద్యేయంగా వెంచర్ చేసిన రియల్టర్లు ఎలాగోలాగా ఇక్కడ ప్లాట్ల ను విక్రయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

కేశవపట్నం వెంచర్ దందా...- news10.app

ఇదీ వెంచర్ దందా…

ఓ వెంచర్ చేయాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి…? రోడ్లు ఎన్ని ఫీట్లు ఉండాలి,..?గ్రీనరీ ఎలా ఉండాలి…?అవేమి లేకుండా వెంచర్ వేసిన అధికారుల్లో ఏమాత్రం చలనం లేకుండా పోతుంది. ఇంత బహిరంగంగా మోసం జరుగుతున్న దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు ఏ చేస్తున్నట్లు … అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.సాధారణంగా వెంచర్ చేయాలంటే నిబంధనల ప్రకారం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు, పార్క్(గ్రీనరీ) భూమిలో10 శాతం ఉండాలి కానీ ఇవేమీ ఆ వెంచర్ లో కనిపించవు. 6 ఎకరాల ఈ వెంచర్ లో ప్రహారీ నిర్మాణం తప్ప ఏమీ కనిపించదు. కనీసం ప్లాట్ల హద్దులు కూడా లేవు. కానీ పేపర్ పై ప్లాట్ల మ్యాపు( హద్దులు) చూపించి రిజిస్ట్రేషన్ లు చేశారట. ఇలా ఈ వెంచర్ పూర్తి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారో వారికే తెలియాలి. ఒకవేళ అనుమతులు ఇచ్చిన కనీస నిబంధనలు పాటించకుండా ప్లాట్లు చేయడం అధికారులు సహకారంతోనే అనే అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి.అధికారులు ఇప్పటికయినా ఈ వెంచర్ అనుమతులు రద్దు చేసి యాజమాన్యం పై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here