నేనింతే …..డ్యూటికి రాను

ఆ సారు అంతే ఆ సారులో ఎంతమాత్రం. మార్పు వచ్చేలా లేదు…పెద్దాసుపత్రికి పెద్ద దిక్కైన ఆ సారు ఆసుపత్రికి రావడం చాలా అరుదు గా మారిందట. ఈ డాక్టర్ సారు వ్యవహారం వార్తల్లోకెక్కి కలెక్టర్ దృష్టికి పోయి విధులకు క్రమంతప్పకుండా రావాలని కలెక్టర్ మందలించిన సారు తీరులో ఆవగింజంత మార్పు కూడా రాలేదు. ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లిన ఆ సూపరింటెండెంట్ సారు కుర్చీ ఖాళీగానే దర్శనం ఇస్తుంది.

నెలలో అతికష్టం మీద ఓ ఐదుసార్లు లేదంటే ఓ రెండు మూడు సార్లు ఆసుపత్రికి వచ్చే ఈ పెద్ద సారు మిగతా అంతా మ్యానేజ్ మీదనే ఆధారపడి పనిచేస్తాడట. అంతేకాదు అంతా నా ఇష్టం నాకు నచ్చినప్పుడే డ్యూటీ కి వస్తా, నాకు చెప్పాలనిపించినప్పుడే పీజీ విద్యార్థుల కు పాఠాలు చెప్తా, నన్ను ఎవరూ ప్రశ్నించవద్దు ఎందుకంటే నేనే ఈ ఆసుపత్రికి బాస్ ని గొప్పలు చెప్తుంటాడట ఆ సూపరిండెంట్ సార్. హన్మకొండ లోని ఛాతి మరియు క్షయ వైద్యశాల సూపరిండెంట్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

నేనింతే .....డ్యూటికి రాను- news10.app

నెలలో 5 రోజులు ఆ సారు విధులకు హాజరయితే మహా ఎక్కువట… ఉమ్మడి జిల్లాలోనే ఈ రకమైన జబ్బులకు ఏకైక దిక్కుగా ఉన్నటువంటి ఛాతి, క్షయ వైద్యశాల ఇప్పుడు సూపరిండెంట్ అందుబాటులో లేకపోయేసరికి దిక్కులేనిదిగా మారిపోయిందట. ప్రతి రోజు పీజీ విద్యార్థుల కు క్లాస్ లు చెప్పాల్సిన సారు నెలకు మూడు సార్లు కూడా తరగతి గదిలో కనిపించటం లేదని విద్యార్థులే ఆరోపిస్తున్నారు. నిత్యం ఆసుపత్రిని పర్యవేక్షించాల్సిన ఈ పెద్ద సారు కనీసం ఆ ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని న్యూస్-10 నిఘా టీం పరిశీలనలో తేలింది.. పైగా సారు హాజరు విషయంలో ఎవరు ప్రశ్నించిన ఏ పేషంట్ అయినా సార్ ని కలవడానికి వెళ్లిన పెద్ద సార్ లీవ్ లో ఉన్నాడని ఆర్ ఎం ఓ సమాధానం చెప్తున్నాడు. గతంలోనే డాక్టర్ సాబ్ హాజరు విధానం పై న్యూస్10 వార్తలు ప్రచురించిన విషయం విదితమే అప్పట్లో రెండు మూడు సార్లు ఆసుపత్రికి వచ్చిన, తరువాత నన్నడిగేది ఎవరు నేనే ఈ ఆసుపత్రికి బాస్ ని అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here