ఆర్టీసీలో కీచక డ్రైవర్…!

  • మహిళా కండక్టర్ కు లైంగిక వేధింపులు
  • కోరిక తీర్చాలంటూ వేధిస్తున్న ఆర్ టి సి అద్దె బస్సు ఓనర్ కం డ్రైవర్
  • కోరిక తీర్చకుంటే ఉరి వేసుకొని చస్తా అని బెదిరిస్తున్న బస్సు ఓనర్
  • అతగాడి బస్సులో డ్యూటీ చేయాలంటేనే వణికిపోతున్న మహిళా కండక్టర్

ఆర్టీసీలో కీచక డ్రైవర్...!- news10.app

అతనికి ఐదు పదుల వయసుంటుంది ఆర్టీసీలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పైగా ఆ బస్సుకు ఓనర్ అతడే. ఆ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ పై అతగాడి కన్నుపడింది. ఎలాగైనా ఆమెను అనుభవించాలనేది అతని కోరిక కాబోలు. తన కోరిక తీర్చాలని నిత్యం డ్యూటీలో వేధిస్తూ ఉండేవాడట, ఆ మహిళా కండక్టర్ ఒంటరి మహిళ కావడంతో ఈ మధ్యే తను నివాసం ఉంటున్న ఇల్లు కనుక్కొని దొంగ చాటున ఇంట్లోకి చొరబడి కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడని విశ్వసనీయ సమాచారం. వేధింపులు భరించలేని సదరు కండక్టర్ ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతున్నానని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని సన్నిహితులతో తన గొడువెళ్లబోసుకుంటుందట. ఆర్టిసీలోని ఉన్నతాధికారులు కాస్త దృష్టి సారించిం ఆ ప్రైవేట్ బస్సు ఓనర్(డ్రైవర్)పై చర్యలు తీసుకోవాలని ఆర్టిసీలో పని చేస్తున్న మహిళలు కోరుకుంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here