ఎం జి ఎం లో ఇంటి దొంగలు…?

ఎం జి ఎం పెద్దాసుపత్రి ఇంటి దొంగలకు నిలయంగా మారిందా…?అంటే అవును అన్నట్లే కనపడుతుంది… ఎం జి ఎం లో పనిచేస్తున్న కొంతమంది ఆసుపత్రిలోని వస్తువులను తమ చేతివాటం బాగానే ప్రదర్శిస్తూ కొట్టివేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి….ఇప్పటివరకు ఆసుపత్రిలోని 40 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది….విలువైన వస్తువులు,వైద్య ఉపకరణాలు కనిపించకుండా పోయినట్లు ఎం జి ఎం లో ప్రచారం జరుగుతోంది… ఈ విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం బయటి వ్యక్తులకు ఎవరికి సాద్యం కాదు కనుక ఇది ఖచ్చితంగా ఎం జి ఎం లో పనిచేస్తున్న ఇంటి దొంగల పనేనని తెలిసింది…

ఎం జి ఎం లో ఇంటి దొంగలు...?- news10.app

కోవిడ్ వార్డ్ లో అన్ని మాయం…?

ఎం జి ఎం కోవిడ్ వార్డ్ లో ఉన్న వస్తువులన్నీ కనిపించకుండా పోయినట్లు ,ఇందులో ఉన్న ఏసీ లు,వెంటిలేటర్లు, బి పి మానిటర్లు మొత్తంగా మాయం ఐయినట్లు తెలిసింది… కోవిడ్ తీవ్రత తగ్గడంతో ప్రస్తుతం ఎం జి ఎం లోని కోవిడ్ వార్డ్ మూసివేసి ఉండగా ఇందులోని వస్తువులన్నీ పూర్తిగా మాయం ఐయినట్లు విశ్వసనీయ సమాచారం…ఇందులో ఉన్న వస్తువులన్నింటిని ఇంటిదొంగలు ఊడ్చేశారని ఎం జి ఎం లో ప్రచారం జరుగుతోంది….ఇందులో వస్తువులు కనిపించకుండా పోయిన విషయం బయటకు రాకుండా అత్యంత జాగ్రత్త వహించిన ఎం జి ఎం అధికారులు… కోవిడ్ వార్డ్ లోని ఏసీలు ,వెంటిలేటర్ లు కనిపించకుండా పోయినట్లు మట్టె వాడ పొలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు తెలిసింది…పిర్యాదు విషయాన్ని సైతం అధికారులు గోప్యంగా ఉంచగా వస్తువులు మాయం ఐయిన విషయంలో ఎం జరిగిందో ఇప్పటికి ఎం తెలియకుండా పోయింది…. ఆసుపత్రిలోని విలువైన వస్తువులు మాయం అవుతున్న ఎం జి ఎం అధికారులు ఏంచేస్తున్నారో వారికే తెలియాలి….

సూపరింటెండెంట్ ఎం చేస్తున్నట్లు….?
రేపటి సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here