నేను మంత్రి మనిషిని…..?

ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న ఎం జి ఎం పెద్దాసుపత్రిలో సామాన్యులకు వైద్యం మాట అటుంచితే ఇక్కడ ఎప్పుడు కాంట్రాక్టర్ ల రాజ్యం నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి…సెక్యూరిటీ,సానిటేషన్, పేషంట్ కేర్ సక్రమంగా నడపాల్సిన ఓ కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పూర్తిగా బరితెగించినట్లు విమర్శలు వస్తున్నాయి… ఎవరు ప్రశ్నించిన ఆ సదరు కాంట్రాక్టర్ బండబూతులతో విరుచుకుపడుతున్నాడట…అంతు చూస్తా అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది….ఎం జి ఎం లో ఎవరిని కనీసం లెక్కచేయని ఇతగాడు తనకు తోచినట్లు ప్రవర్తిస్తున్నట్లు సమాచారం…ఇటీవల ఓ విషయంలో వివరణ అడిగిన ఓ ఇద్దరు విలేకర్లపై సైతం ఈ కాంట్రాక్టర్ బాగానే నోరు పారేసుకున్నాడట…ఇతగాడి ప్రవర్తనతో ఖంగుతిన్న ఆ విలేకర్లు చేసేదేమీ లేక అక్కడనుంచి నిష్క్రమించారట…కృష్ణ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఎం జి ఎం లో సెక్యూరిటీ,సానిటేషన్,పేషంట్ కేర్ కాంట్రాక్ట్ తీసుకున్న ఇతగాడు…ఉద్యోగులను నియమించడానికి బాగానే చేతివాటం ప్రదర్శించి లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…. ప్రజాప్రతినిధులు, ఇతరులు ఎవరైనా తెలిసినవారిని ఉద్యోగాల్లో నియమిస్తే ఈ కాంట్రాక్టర్ వారిని రాచిరంపాన పెట్టి ఉద్యోగం వదిలి వెళ్లాలని వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలియవచ్చింది…. ఇలా ఖాళీ ఏర్పడిన ఉద్యోగాల్లో కావాల్సింది ముట్టజెప్పితే ఇతరులను నియమిస్తున్నాడట….

నేను మంత్రి మనిషిని.....?- news10.app

నేను మంత్రి మనిషిని….?

ఎం జి ఎం సూపరింటెండెంట్ మొదలుకొని ఎవరు ఈ కాంట్రాక్టర్ ను ప్రశ్నించిన తాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మనిషినని బెదిరిస్తున్నాడట….ఎం జి ఎం లో టెండర్ వేస్తే ఈ ఇప్పించింది మంత్రే నని అందుకు కావాల్సింది తాను సమర్పించానని పోజులు కొడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…తన వెనకాల మంత్రి ఎర్రబెల్లి ఉన్నాడు కనుకనే తాను ఎవరిని లెక్కచేయడం లేదని ఏదైనా మంత్రే చూసుకుంటాడని ఈ కాంట్రాక్టర్ ధీమాగా ఉన్నట్లు ఎం జి ఎం లో జోరుగానే ప్రచారం జరుగుతోంది…. దీనికితోడు ఎం జి ఎం లో ఈ కాంట్రాక్టర్ ఏంచేసిన అధికారులు ప్రశ్నించకపోవడం ఎం జరిగిన ఈజీగా తీసుకుంటుండడంతో ఇతగాడి వెనకాల నిజంగానే మంత్రి ఉన్నట్లు మరింతగా ప్రచారం జరుగుతోంది…

అర కొర సిబ్బంది…4 కోట్లు హాంఫట్

వరంగల్ ఎం జి ఎం లో వివిధ విభాగాల్లో టెండర్ వేసి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మొత్తంగా ఎం జి ఎం లో నిబంధనల ప్రకారం 675 మంది ఉద్యోగులను నియమించాల్సిఉంది..కానీ అప్పనంగా డబ్బులు కొట్టేసేందుకు ఈ కాంట్రాక్టర్ కేవలం 350 మందినే నియమించి గత నాలుగు నెలలుగా పనికానించేస్తున్నాడట….కానీ సర్కార్ నుంచి మాత్రం 675 మంది ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు దండుకోగా ఇప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబందించిన బిల్లు 4 కోట్లవరకు ఇతగాడు తీసుకున్నట్లు సమాచారం…తక్కువ సంఖ్యలో వర్కర్స్ ను నియమించి ఎక్కువ మొత్తంలో డబ్బులు దండు కుంటున్న ఇతగాడి వల్ల ఇప్పటికే సర్కార్ ఖజానాకు బాగానే గండి పడినట్లు తెలుస్తుంది… మంత్రి పేరుతో ఈ కాంట్రాక్టర్ ఎం జి ఎం అధికారులను మ్యానేజ్ చేసి ఇప్పటికే బిల్లు మంజూరి చేసుకున్నట్లు తెలిసింది…ఇది ఇలావుంటే ఈ కాంట్రాక్టర్ తాను నియమించుకున్న సెక్యూరిటీ, సానిటేషన్ సిబ్బందికి జీతాల్లో సైతం కోత పెడుతున్నాడట…. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో వర్కర్ కు 15 వేల 6 వందల వేతనం చెల్లించాల్సిఉండగా అందుకు విరుద్ధంగా తన ఇష్టం వచ్చినట్లు కోత పెడుతూ పది వేల నుంచి 11 వేల వరకే వేతనం చెల్లిస్తున్నట్లు తెలిసింది…ఇదేంటని వారు ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరిస్తున్నాడట…మొత్తానికి ఈ కాంట్రాక్టర్ మంత్రి దయాకర్ రావు మనిషినని ఎం జి ఎం లో అందరిని బెదిరింపులకు గురిచేస్తు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఎం జి ఎం లో ప్రచారం జరుగుతోంది… ఇంత జరుగుతున్నా ఈ విషయం మంత్రి దృష్టికి పోకపోవడం మంత్రి ఇతగాడిని మందలించి గాడిన పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది… మరి ఇప్పటికైనా మంత్రి ఎర్రబెల్లి ఇతగాడిని దూరం పెడతాడ లేక పోనీలే అని వదిలేస్తారా…చూడాలి.

కాంట్రాక్టర్ కు ఆ బిల్లు మంజూరి చేసింది ఎవరు….?

బిల్లు మంజూరికి సూపరింటెండెంట్ ఎలా సంతకం చేశారు….?

మంత్రి ఎర్రబెల్లి ఫోన్ చేయగానే బిల్లు మంజూరి ఐయిందా…..?

పూర్తి కథనం వచ్చే సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here