అమాత్య ఆ బిల్లు మీ వల్లేనట…?

ఎం జి ఎం లో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ నోరు తెరిస్తే చాలు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మనిషిని అంటూ అందరిని బెదిరింపులకు గురి చేస్తున్నాడట…అసలు టెండర్ తనకు మంత్రే ఇప్పించాడని తన సన్నిహితుల వద్ద ,ఎం జి ఎం లో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఇతగాడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి మ్యాన్ పవర్ ను నియమించుకున్న ,అర కొర సిబ్బందితో మూడు నెలలు నెట్టుకొచ్చిన పూర్తి బిల్లు ఎలా మంజూరి ఐయిందో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది….675 మంది సిబ్బందిని నియమించాల్సి ఉండగా కేవలం 350 మంది సిబ్బందిని మాత్రమే నియమించి 675 మందికి సంబందించిన బిల్లును ఈ కాంట్రాక్టర్ ఎలా తీసుకున్నాడు… ఇలా చేయడానికి సహకరించిందేవరు…?అనేది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది…ఒకటి కాదు రెండు కాదు అప్పనంగా ఈ కాంట్రాక్టర్ 4 కోట్లు ఎలా తీసుకున్నాడేది ఇప్పుడు ఎం జి ఎం లో హాట్ టాపిక్ గా మారిందట…

అమాత్య ఆ బిల్లు మీ వల్లేనట...?- news10.app

అమాత్య మీ వల్లేనట…..?

అరకొర సిబ్బందిని నియమించి..వారి జీతాల్లో సైతం ఇష్టం వచ్చినట్లు కోత విధించి …సర్కార్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో బిల్లు పొందిన కాంట్రాక్టర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది….కాంట్రాక్టర్ సైతం తాను ఎర్రబెల్లి మనిషిని అంటూ ప్రచారం బాగానే చేసుకుంటున్నాడని తెలిసింది… సిబ్బందిని సక్రమంగా నియమించకున్న,పని తీరు సరిగా లేకున్నా ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబందించిన బిల్లు మంత్రి చెప్పడం మూలంగానే మంజూరి ఐయిందని ఎం జి ఎం లో ప్రచారం సాగుతోంది…. అసలు ఈ కాంట్రాక్టర్ చేయిస్తున్న పని ఏంటి… సిబ్బందిని ఎలా నియమించాడు…? అనే విషయం మంత్రికి తెలుసో లేదో తెలియదు కాని బిల్లు మంజూరి చేయాలని ఎం జి ఎం సూపరింటెండెంట్ కు మంత్రి ఫోన్ చేసినట్లు…ఆ ఫోన్ కాల్ తోనే ఎలాంటి పరిశీలన చేయకుండా బిల్లు పై సూపరింటెండెంట్ సంతకం చేసి ఫైల్ పార్వర్డ్ చేసినట్లు ఎం జి ఎం లో చర్చ జరుగుతోంది…. దీనికి తోడు కాంట్రాక్టర్ సైతం మంత్రి ఫోన్ వల్లే తనకు బిల్లు మంజూరి ఐయిందని అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలిసింది…

సూపరింటెండెంట్ ఎం చేశారు….?

ప్రస్తుతం ఎం జి ఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ ఇంతజరుగుతున్న ఎం పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదు…టెండర్ ప్రక్రియ లో ఓ వ్యక్తి కాంట్రాక్ట్ దక్కించుకుంటే అతడు ఎం చేస్తున్నాడు ..?ఎంత మంది సిబ్బందిని నియమించాడు…?సిబ్బంది పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడనే కనీస పరిశీలన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది… సగం మంది సిబ్బందిని నియమించి కాంట్రాక్టర్ పని కానిస్తుంటే ఆ విషయం గమనించకుండా అంత పెద్ద బిల్ పై సూపరింటెండెంట్ ఎలా సంతకం చేశారో ఆయనకే తెలియాలి…. సూపరింటెండెంట్ ఇలా చేయడం వెనకాల మతలబు ఏంటో…? పలు అనుమానాలకు తావిస్తోంది….

బ్లాక్ లిస్ట్ లో పెడతారా ….?

మంత్రి పేరును వాడుకుంటూ ఎం జి ఎం లో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్స్ ను అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెడతారా…కేవలం పైరవీతో టెండర్ దక్కించుకున్న మంత్రి మనిషిని అంటూ మాటలు చెపుతూ అర కొర సిబ్బందిని నియమించి పూర్తి బిల్లు తీసుకొని అధికారులను పక్కదారి పట్టించి సర్కార్ ఖజానాకు గండి కొట్టిన సదరు కాంట్రాక్టర్ నుంచి అధికారులు డబ్బు రికవరీ చేస్తారా…? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయ….వేచిచూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here