భూదందాల్లో ఆరితేరిన ఆ ఇద్దరు….?

అవును ఆ ఇద్దరు భూ దందాల్లో రెచ్చిపోతున్నారు గతంలో పటాదారులు అమ్మిన భూముల వారసులను వెతికి మరీ వారిని తప్పుదోవ పట్టించి నయానో భయానో ఇచ్చి భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వీరిరువురి కన్ను వరంగల్ లోని పైడిపల్లి శివారు, మట్వాడ శివార్లలో ని భూములపై పడినట్లు నగరవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. వీరిరువురికి సొసైటీ లో పలుకుబడి ఉండటంతో రియల్ రంగంలో దూసుకుపోతున్నారు. అయితే వీరు ఈ మధ్యకాలంలో ఓ మాజీ ఐఏఎస్ కు మాయమాటలు చెప్పి ఆయనను తప్పుదోవ పట్టిస్తూ వారి వంశస్తులు గతంలో తెల్ల కాగితాలపై అమ్మిన భూములను వీరి వశం చేసుకుంటూ గతంలో కొన్నవారిని భయాందోళనకు గురిచేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది.వీరిలో ఒకరు అధికార పార్టీ ఎంపిపి కాగా మరొకరు ములుగు నుండి నగరానికి వచ్చి స్థిరపడిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది.

భూదందాల్లో ఆరితేరిన ఆ ఇద్దరు....?- news10.app

ఆ ఇద్దరి భూ దందా పై న్యూస్-10 వరుస కథనాలు త్వరలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here