అడ్డంగా బుక్ అవుతున్న మద్యం అక్రమార్కులు

కరోన కాలం లో లాక్ డౌన్ వేళా కొంతమంది మద్యం వ్యాపారులు ఎలాగోలా తమ అధిక తెలివి కి పదును పెట్టి అక్రమంగా మద్యం విక్రయించి నాలుగు పైసలు వెనకేసుకుందామనే అత్యాశకు పోతున్నారు. పోలీసులకు దొరికి పోయి తెల్ల మొహం వేస్తున్నారు. లోవీక్ డౌన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి అక్రమంగా మద్యం విక్రహిస్తూ, వేరే ప్రాంతాలకు తరలిస్తూ సివిల్ పోలీసులకు, ఎక్సిజ్ పోలీసులకు మద్యం రాయుళ్లు చిక్కు తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని మసికొండలో ఓ వ్యక్తి తన ఇంట్లో 8 లక్షల విలువ చేసే మద్యాన్ని అక్రమంగా నిలువచేసి పోలీసులకు చిక్కాడు. అధిక మొత్తంలో ఇంటిలో మద్యం నిలువ ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంట్లో తనిఖీ నిర్వహించగా 8 లక్షల రూపాయల విలువ చేసే మద్యం బయట పడింది. మద్యాన్ని స్వాదినం చేసుకున్న పొలిసులు ఎక్సిజ్ పోలీసులకు సమాచారం అందించి నిల్వలను అప్పగించారు.

అడ్డంగా బుక్ అవుతున్న మద్యం అక్రమార్కులు- news10.app

కారుకు పోలీస్ స్టిక్కర్…అక్రమంగా మద్యం తరలింపు…అడ్డంగా బుక్

వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన రవి, రాజ్ కుమార్ లు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న శ్రీనివాస వైన్స్ నుంచి అక్రమంగా మద్యం తరలించాలని అనుకున్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో వాహనాలను అనుమతించక పోవడంతో తాము ప్రయాణించే కారుకు పోలీస్ స్టిక్కర్ ను అతికించారు. చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులకు అనుమానం రాకుండా కారు లోపల సీట్ పై పోలీస్ క్యాప్ ను ఉంచారు. ఎలాగోలాగ నర్సంపేట కు చేరుకున్నారు. వైన్స్ షట్టర్ ను తెరిచి మద్యం తరలించాలని అనుకుంటుండగా పెట్రోలింగ్ లో బాగంగా అటువైపు గా వచ్చిన పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడింది. అక్రమంగా మద్యం తరలించాలని నర్సంపేట కు వచ్చారని అర్దం అయ్యింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ మద్యం తరలింపును అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here