డిసెంబర్ వరకు లాక్ డౌన్ – జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ప్రయత్నమంత వృధా అవుతుందన్నారు.పండుగలు ఉన్నాయని సడలింపులు ఇస్తే పరిస్థితి మొదటికి వస్తుందన్నారు. రంజాన్, బతుకమ్మ, దసరా, బోనాలు ఇలాంటి పండుగల సందర్భాల్లో జనం ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉన్నందున దీనికి డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించడమే మార్గం అన్నారు.ఈ విషయమై తాను కేసీఆర్ కు లేఖ రాస్తానన్నారు.కరోన కట్టడి,లాక్ డౌన్ అమలు విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సహకరిస్తారని అన్నారు.