బావిలోపడి వలసకూలీల ఆత్మహత్య

వరంగల్ గొర్రెకుంట లో దారుణం

గిసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కోల్డ్ స్టోరేజ్ కు ఎదురుగా ఉన్న బావిలో పడి నలుగురు వలస కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది. బతుకు దేరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన ఈ బీహార్ కు చెందిన వలసకూలీలు స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు.లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి పోయే వీలు లేక వీరూ ఆత్మహత్యకు పాల్పడిన ట్లు సమాచారం.ఈ సమాచారం తెలిసిన వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నారు.

బావిలోపడి వలసకూలీల ఆత్మహత్య- news10.app