మినీ పుర పోరు…మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మ్రోగింది..రాష్ట్ర్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పోషన్, సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లు కాగా మిగతా అయిదు మున్సిపాలిటిలకు నోటీఫికేషన్ జారీ చేశారు. కాగా 16న నామినేషన్ల ప్రక్రియ రేపటి అనగా నుండే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనుండగా మే 3 ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి.

ఇది షెడ్యూల్…

మొత్తం ఎన్నికల ప్రక్రియ పదిహేను రోజుల్లో ముగియనుండగా 18 వతేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు విధించారు. ఇక 19 తేదిన స్క్రూటిని నిర్వహించి.. 20 తేదిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు. 30 వ తేదిన ఎన్నికల నిర్వహించనుండగా.. ఒకవేళ ఎక్కడైన రీపోలింగ్ ఉంటే మే 2 న నిర్వహించనున్నారు.

మినీ పుర పోరు...మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల- news10.app

రిజర్వేషన్లు ఖరారు

ఈ నేపథ్యంలోనే వరంగంల్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు ,ఖమ్మం మున్సిపాలిటీలకు కూడ రిజర్వేషన్లను ఖారరు చేస్తూ.. జిల్లా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌కు రిజర్వేషన్లు ఖారారు అయ్యాయి. మొత్తం ఆరవై వార్డుల రిజర్వేషన్ ఖారారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అరవై వార్డులకు గాను 14 వార్డులను అన్‌రిజర్వడ్, 16 స్థానాలు జనరల్ మహిళ రిజర్వేషన్ గా మరో 20 వార్డులు బీసీ జనరల్ వార్డులుగాను 7 స్థానాలు ఎస్సీలకు 3 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు.

ఖమ్మం వార్డుల రిజర్వేషన్స్

కాగా రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించిన వాటిలో 32 వార్డు ఎస్టీ మహిళకు 1 మరియు 8 వార్డులను ఎస్సీ జనరల్‌కు కేటాయించగా,ఏస్సీలకు కేటాయించిన ఏడు వార్డుల్లో 22,42,59 ఎస్సీ మహిళలు, 40,4352, 60 వార్డులను ఎస్సీ జనరల్ కు,బీసీలకు కేటాయించిన 20వార్డుల్లో 28, 29, 30, 33, 34, 38, 46, 47, 48, 57 హిళలకు 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 అభ్యర్డులను బీసీ జనరల్‌కు కేటాయించారు. కాగ 16 స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించిన వాటిలో 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 స్థానాలు కేటాయించగా మిగిలిన 14 స్థానాలు న్‌రిజర్వ్‌డ్ స్థానాలుగా ప్రకటించారు.

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ఇవాళ రిజ‌ర్వేష‌న్ల జాబితాను విడుద‌ల చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌రిధిలోని 66 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖరారు కాగా, 65వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు, 2వ డివిజ‌న్ ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ‌న్లు ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 15, 17, 18, 37, 47, 53 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజ‌న్ల‌ను బీసీ మ‌హిళ‌ల‌కు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజ‌న్లు బీసీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజ‌న్ల‌ను జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు కేటాయించారు.

878 పోలింగ్‌ స్టేషన్లు

66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహి స్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్లలో 800 ఓట్లకు మిం చకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందాలను ఎన్నికల అధికారి నియమించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతి బృందంలో తహసీల్లార్లు, ఇరిగేషన్‌ అ ధికారులు, పోలీస్‌ అధికారులు, వీడియో గ్రాఫర్‌ ఉంటారు.