తరిమికొడదాం…!

డబ్బే నడిపిస్తుందట అబ్యర్ధిని ఎన్నికల్లో…!
డబ్బే ప్రదానమంటు తామే గెలిచినట్లు నాయకులవి ఎన్ని’కలలు’

ప్రజాబలం ధనం ముందు దిగదుడుపేనట!
గెలుపు ఓట్లు రాలాలంటే పైసా పంపకమే కీలకమట….!

డబ్బు పంచి ఓట్లను కొంటారా.. అయ్యో ఎంతమాట…!
ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల కొనుగోలు ఆట!

చూస్తున్నారా…జనత
కదలాలి మనమంతా…!
ఓటు అమ్మకం కాదు…సంక్షేమ నమ్మకం కావాలని నినదించాలి సర్వత్రా…!

డబ్బు సంచులను తరిమికొట్టె… ప్రజాపాలన రావాలి!
జనమంతా ఏకమై డబ్బు పాతరేస్తామని నినదించాలి…!