మంత్రి పట్టించుకోవాల్సిందే….!

పేదల పెద్దాసుపత్రి గాడి తప్పుతోంది…పాలన సరిగా లేక సమస్యలతో సతమతమవుతుంది… ఆసుపత్రిని పట్టించుకోవాల్సిన ఎంజీఎం అధికారులు ఎవరికివారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి…సిబ్బంది మొదలుకొని వైద్యం వరకు అన్ని సమస్యల వల్ల ఎంజీఎం ఇక గాడిలో పడదా అని విమర్శలు వస్తున్నాయి… ఇవన్నీ పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారులు సైతం తమకేం పట్టనట్లు చూసి చూడనట్లు వ్యవహరించడం సమస్యలు
ఎక్కడివి అక్కడే పడకేస్తున్నాయి…

మంత్రి పట్టించుకోవాల్సిందే....!- news10.app

మంత్రి పట్టించుకోవాలి…..

ఎంజీఎం లో ఉన్న సమస్యలు, పరిష్కారం. ఆసుపత్రిని గాడిలో పెట్టే విషయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది…మంత్రి జోక్యం చేసుకోవాలని పలు సంఘాలు సైతం కోరుతున్నాయి… ఎంజీఎం లో సెక్యూరిటీ గార్డ్ లు,సానిటేషన్, పేషంట్ కేర్ విషయంలో కాంట్రాక్టర్ అనుసరిస్తున్న విధానాలపై, సిబ్బంది పట్ల కాంట్రాక్టర్ వ్యవహార శైలి, అరకొర సిబ్బంది నియామకం పట్ల మంత్రి ఇప్పటికే ఆరా తీసిన ఆ కాంట్రాక్టర్ పై ఎంజీఎం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కలుగజేసుకోవాలని పలు సంఘాలు కోరుతున్నాయి…

మంత్రి పేరు చెప్పి అధికారులు, సిబ్బందిని ఇష్టారీతిన బూతులు తిడుతున్న కాంట్రాక్టర్.పై చర్యలు తీసుకొని టెండర్ రద్దుకు మంత్రి సిపార్స్ చేయాలని వారు కోరుతున్నారు…. అరకొర సిబ్బందిని నియమించి మూడు నెలలకు గాను 4కోట్లు బిల్లు తీసుకున్నాడని నియమించిన సిబ్బందికి కాక లేని సిబ్బంది పేరుపై సైతం బిల్లు మంజూరి చేసుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడనే ఆరోపణలు ఉండగా వీటిపై మంత్రి సమగ్ర విచారణ జరిపించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు…

కాంట్రాక్టర్ ఇష్టారాజ్యానికి చెక్ పెడితే బాగుంటుందని వారినుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది…. మంత్రి అండ ఉందని కాంట్రాక్టర్ లేనిపోని ప్రచారం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండటం వల్ల ఎంజీఎం లోని కొందరు అధికారులు సైతం భయపడాల్సిన పరిస్థితి నెలకొందని అందుకే ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకొని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని వారు అంటున్నారు….

ఇదిలాఉంటే కొంతమంది ఉద్యోగులు డిప్యుటేషన్ పై ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ఆసుపత్రి పాలన వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ ఎంజీఎం లో తాము ఎంత చెప్పితే అంత అన్నట్లు ప్రవర్తిస్తున్నారని అలాంటి ఉద్యోగులను సైతం గుర్తించి వారి డిప్యుటేషన్ ను రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినపడుతోంది…. ఇవన్నీ చర్యలను మంత్రి వెనువెంటనే చేపడితే ఎంజీఎం ఆసుపత్రి ఎంతోకొంత గాడిలో పడే అవకాశం ఉందనే వాదనలు ఎంజీఎం లో బాగానే వినపడుతున్నాయి…. ఎంజీఎం విషయంలో ఇకనైనా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పట్టించుకోవాల్సిందేనని పలువురు అంటున్నారు… మరి ఈ విషయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here