ఇప్పుడేం చేద్దాం…?

న్యూస్10 సోమవారం సంచికలో వెలువరించిన”ప్రభుత్వ భూమి పై కాంట్రాక్టర్ కన్ను” అనే కథనం తీవ్ర చర్చకు దారితీస్తోంది ….నాలా కన్వర్షన్ అయిన భూమిలో కాకుండా ప్రభుత్వ భూమిలో 10 గుంటలు చదును చేసి ప్రహారీ నిర్మించడానికి సిద్ధమైన కాంట్రాక్టర్ న్యూస్ -10 కథనంతో డైలామలో పడ్డట్లు సమాచారం. హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపుతూ 2 కోట్ల విలువైన భూమిని కొట్టేసే వ్యూహం బెడిసికొట్టడంతో సదరు వ్యక్తులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

ఇప్పుడేం చేద్దాం...?- news10.app

ఒక వ్యూహం ప్రకారం రికార్డు లో అదనంగా ఉన్న భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో కన్వర్షన్ చేసుకున్న వీరు న్యూస్-10 కథనంతో ఆ విషయాన్ని బయటపెట్టడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే వీరు నాలా కన్వర్షన్ చేసుకున్న భూమిలో ప్రభుత్వ రోడ్డు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ భూమిలో రోడ్డు ఉన్న విషయం తెలియని రెవెన్యూ అధికారులు నాలా కన్వర్షన్ చేసేసారట. దింతో ఈ కన్వర్షన్ వ్యవహారం కాస్త ఇప్పుడు అటూ ఇటూ పోయి రెవెన్యూ అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నట్లు వంగపహాడ్ లో ప్రచారం జరుగుతోంది… దింతో ఈ భూమి వ్యవహారంలో ఎం చేయాలో రెవెన్యూ అధికారులు ఆలోచనలో పడ్డట్లు తెలిసింది…

రాష్ట్ర ప్రభుత్వం ధరణి ప్రవేశ పెట్టాక నాల కన్వర్షన్ కోసం భూ యజమానులు ఆన్ లైన్ లొనే అప్లై చేసుకుంటున్నారని తాము అనుమతులు ఇస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్న కుడా రహదారి ఉన్న భూమికి ఎలా నాల కన్వర్షన్ చేశారని… ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారులవద్ద సమాధానం లేకుండా పోయింది… రెవెన్యూ అధికారులు కనీస పరిశీలన చేయకుండా క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకోకుండా నాల కన్వర్షన్ చేశారని స్పష్టం అవుతోంది…దీన్నీ హసన్ పర్తి మండల తహశీల్దార్ ఎలా సమర్దిస్తారో ఆయనకే తెలియాలి…

కన్వర్షన్ చేసిన భూమిలో రోడ్డు, చదును చేసింది ప్రభుత్వ భూమి…?

హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారులోని సర్వే నెం…613 లోని 10 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు గత నెలలో నాలా కన్వర్షన్ చేశారు. కానీ ఆ సర్వే నెం.. నుండి ప్రభుత్వ రోడ్డు ఉంది అది తెలుసుకోకుండానే రెవెన్యూ అధికారులు నాలా సర్టిఫికెట్ జారీచేశారు. ఇదంతా ఒకెత్తయితే కన్వర్షన్ చేసిన సర్వే నెం..613 లోని భూమి కాకుండా పక్కనే ఉన్న సర్వే నెం..516లో ఉన్న ప్రభుత్వ భూమి 10 గుంటలను చదును చేసి ఈ భూమినే కన్వర్షన్ చేసిన సర్వే నెం 613 భూమిగా చూపెడుతున్నట్లు తెలుస్తుంది…ఈ ప్రభుత్వ భూమి విషయంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here