ఎంజియం కాంట్రాక్టర్ తప్పు తేల్చేదెవరు……?

తనవద్ద పనిచేస్తున్న సిబ్బందికి వేదింపులు, నిబంధనల ప్రకారం నిర్ణయించిన జీతాల్లో ఇష్టం వచ్చినట్లు కోత… ఇదేంటని ప్రశ్నిస్తే నోటికివచ్చిన బండబూతులు…అరకొర సిబ్బందిని నియమించి ఫుల్లుగా బిల్లు మంజూరి చేసుకోవడం…ఇవి ఎంజీఎం లో ప్రస్తుతం సెక్యూరిటీ గార్డులు, సానిటేషన్ ,పేషేంట్ కేర్ కాంట్రాక్టర్ గా ఉన్న సంస్థ పై వస్తున్న ఆరోపణలు…ఇన్ని ఆరోపణలు ఉన్న అవి నిజమేనని తెల్సిన చర్యలు తీసుకోవడానికి ఎంజియం అధికారులకు ఏమాత్రం మనసు రావడం లేదట….
బిల్లు చెల్లించారు…

టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎంజీఎం లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 675 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది…కానీ అందుకువిరుద్దంగా కేవలం 350 మంది సిబ్బందిని మాత్రమే నియమించినట్లు సమాచారం…కాగా ఈ విషయం ఎంజీఎం అధికారులకు తెలిసిన ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది…

ఎంజియం కాంట్రాక్టర్ తప్పు తేల్చేదెవరు......?- news10.app

ఎంజియం సూపరింటెండెంట్ సిబ్బంది విషయంలో కనీస పరిశీలన చేయకుండా…సిబ్బంది ఎంతమంది ఉన్నారో తెలుసుకోకుండా బిల్లు మంజూరికి సంతకం చేయడం కాంట్రాక్టర్ విషయంలో వారు చూపిస్తున్న ఆసక్తికి అద్దం పడుతోంది… అరకొర సిబ్బందితో మొత్తం బిల్లు మంజూరి చేయించుకున్న కాంట్రాక్టర్ సాటిస్ప్యాక్టరీ సర్టిఫికెట్ సమర్పించార…? బిల్లు మంజూరికి ఇతర అధికారులు ఒకే చెప్పారా… ఇవన్నీ లేకుండానే ఎంజీఎం సూపరింటెండెంట్ ఏకపక్షంగా బిల్లు మంజూరికి సంతకం పెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి… అందుకే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారనే అనుమానాలు కూడా లేకపోలేదు…కాంట్రాక్టర్ పై ఇప్పటికి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది… సర్కార్ ఖజానాకు తప్పుడు సమాచారంతో గండి కొట్టిన కాంట్రాక్టర్ పై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో….అసలు తీసుకోరో అధికారులకే తెలియాలి…మరోవైపు ఎంజీఎం లో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ వెనకాల కొంతమంది అదృశ్యంగా ఉంటూ కథ నడిపిస్తున్నట్లుగా ఎంజీఎం లో ప్రచారం జరుగుతుంది…వీరు ఇస్తున్న సలహాలతో ఎంచేసిన తనకు ఏంకాదనే ధీమాతో కాంట్రాక్టర్ ఉన్నట్లు తెలిసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here