మంత్రివర్యా….ఓ మాటింటారా?

కరోన టెస్టుల్లో పేదలకో న్యాయం..వీఐపీలకు ఓ న్యాయమా..?
వీఐపీలవి ప్రాణాలు పేదలవి కావా…?
కరోనాతో వ్యక్తి మృతి చెందితే మృతుడి కుటుంబ సభ్యులకు టెస్టులు చేయరా…?
ఇంటికి తాళం వేస్తారు,ప్లెక్సీ కడతారు టెస్టులు మాత్రం చేయరు
ఆరోగ్య మంత్రి కలుగజేసుకోవాలని కరోన బాధిత కుటుంబాల డిమాండ్

బంగారు తెలంగాణ అన్నింటిలో దూసుకు పోతుందని ప్రభుత్వం బాకా ఊదుకుంటున్న ఆరోగ్యంలో మాత్రం వెనుకపడినట్లే ఉంది. కరోన మహమ్మారి రాష్ట్ర రాజధానిలో కరాళనృత్యం చేస్తోంది. మెట్రో నగరవాసుల్లో ప్రస్తుతం ఏ క్షణాన ఎం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. కొత్తవారు కనపడిన, ఏదైనా పనిపై వెళ్లాలన్న చివరికి వారి తిండి వారు తినాలన్న భయంతో అనుమానించాల్సిన పరిస్థితులు దాపురించాయి. సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కరోన బారినపడుతున్నారు, ఐయితే కరోన విషయంలో ప్రజాప్రతినిధుల వైద్యం తదితర అవసరాలు చకచకా సమకూరుతున్నాయి. కానీ సామాన్యులు మాత్రం చుక్కలు చూస్తున్నారు. సరైన వైద్యం అందక కరోన పాజిటివ్ గా నిర్దారణ అయిన గంటల్లోనే మృత్యు వాత పడుతున్నారు. రోగనిరోధక శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉన్నవారు, వయస్సు పైబడిన వారు జీవితాన్ని ముగించేస్తున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క గాంధీలో వైద్యం సరిగా అందుతుందని ప్రజలు భావిస్తుంటే ప్రస్తుతం ఆ ఆసుపత్రి సైతం రోజురోజుకు అపఖ్యాతి మూటకట్టుకుంటుంది.. తప్పిపోయిన, తారుమారు ఐయిన కరోన పేషేంట్ల మృతదేహలతో ఓ పక్క గందరగోళం నెలకొంటే ప్రస్తుతం టెస్టుల విషయంలో మరింత గందరగోళం తయారైంది.

మంత్రివర్యా....ఓ మాటింటారా?- news10.app

ఆరోగ్య మంత్రి ఈ మాట వినండి!

కరోన పాజిటివ్ గా కుటుంబం లోని ఏ వ్యక్తి తేలిన ఆకుటుంభంలో ఉండేవారందరికి కరోన పరీక్షలు చేయడం తప్పనిసరి కానీ అలా జరగడం లేదు. అంతేకాదు కరోన బారిన పడి కుటుంబంలో ఎవరు మరణించిన ఇంట్లో వారందరికీ వెంటనే పరీక్షలు చేసి నెగిటివా.. పాజిటివా? అని నిర్దారణ చేయాలి కానీ అలా కూడా జరగడం లేదు వైద్య శాఖను, వైద్యాధికారులను సంప్రదిస్తే కరోన లక్షణాలు కనపడితే తప్ప పరీక్షలు చేయమని ఖరాఖండిగా చెప్తున్నారు. పోనీ ఇన్నో రోజులు కరోన పేషంట్ తో అతి దగ్గరగా ఉన్న వారికి బలవర్ధకమైన ఆహారం అందించి రోగనిరోధక శక్తి పెంచుతారా… ఆదిలేదు. ముందస్తుగా ఏవైన మందులు అందించి కరోన రాకుండా చూస్తారా.. అలా కూడా లేదు. దీని మూలంగా కరోన రావడం ఏమో కాని కోవిడ్ బాఫైట కుటుంబాలు భయం, ఆందోళనతో సగం చస్తున్నారు. ఓ ఇంటి లో కరోన పాసిటివ్ పేషంట్ ఉన్న, కోవిడ్ బారిన పడి మరణించిన ఆ కుటుంబం ఇంటి గేట్ కుతాళం వేసి, విషయాన్ని తెలుపుతూ ప్లెక్సీ కట్టి అధికారులు జాగ్రత్త పడుతున్నారు కాని లోపల ఉన్న బాధితుల్ని పట్టించుకోవడం మానేశారు. ఓ ఫోన్ నంబర్ చేతికిచ్చి ఎం అవసరం ఉన్న చెప్పండి తీసుకొచ్చి ఇస్తాం..అంటారు. వస్తువులు కావాలన్న భోజనం కావాలన్న డబ్బులు ఇస్తేనే తెచ్చి ఇస్తారు. నిన్నటికి నిన్న వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఓ స్టాఫ్ నర్సుకు కరోన పాజిటివ్ గా తేలితే ఆమెను చికిత్స కోసం ఎంజీఎం తరలించారు కుటుంబ సభ్యులను మాత్రం గాలికొదిలేశారు. ఈ విషయమై బాధిత కుటుంబం వైద్యాధికారి కి ఫోన్ చేస్తే నిర్లక్ష్యపు సమాధానం మీఇష్టం, నాకు తెలియదు, టెస్టులు చేయం, కలెక్టర్ ను అడగండి అంటూ పొడి పొడి సమాదానాలతో చేతులు దులుపుకుంది దింతో ఆకుటుంభంలో ఆందోళన పెరిగింది తప్ప …తగ్గలేదు. కోవిడ్ బాధిత కుటుంబం అని తెలిసినా అధికారులు వారిని నిర్లక్ష్యంగా వదిలేశారు తప్ప ఎలాంటి పట్టింపు లేదు. ఒక్క రోజు హడావుడి చేసి ఆ తర్వాత వదిలేశారు తప్ప ఏమాత్రం పట్టించుకోవడంలేదు.

సామాన్యులకు ఓ రకం… వీఐపీలకు ఓ రకమా..?

కరోన విషయంలో బాధితులకు సమన్యాయం జరగడం లేదని సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. కోవిడ్ బారిన పడి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు కరోన పరీక్షలు చేయడానికి వ్యాధి లక్షణాలు ఉంటేనే పరీక్షలు అంటున్న అధికారులు ఓరాజ ప్రతినిధులకు మాత్రం డ్రైవర్లకు, పీఏ లకు కరోన పాజిటివ్ అని తేలితే చాలు పరిగు పరుగు పరుగున వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. కరోన తో ఇంట్లో ఓ వ్యక్తిని కోల్పోయి హై రిస్క్ జోన్లో ఉన్నవారికి మాత్రం పరీక్షలు చేయమంటే వైద్యాధికారులు గుడ్లురుముతున్నారు. దింతో సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ మరణం సంభవించిన బాధిత కుటుంబ సభ్యులు తమకు పరీక్షలు చేయమని అడిగితే గాంధీకి వెళ్ళండి అంటూ ఉచిత సలహా ఇస్తున్న స్థానిక వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి రోగం తెచ్చుకుంటారా…? అంటూ భయపెడుతున్నారని హైద్రబాద్ లోని ఓ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం జాగ్రత్తలు కూడా చెప్పకుండా వదిలేశారన్నారు. ఇకనైనా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించి బాదిత కుటుంబాలకు పరీక్షలు నిర్వయించాలని వారు కోరుతున్నారు.