గీసుగొండ వైద్యాధికారి నిర్లక్ష్యం….!

మేం కరోన టెస్టు లు చేయం…. మీ ఇష్టం
గీసుగొండ మండల వైద్యాధికారి మాధవీలత నిర్లక్ష్యపు సమాధానం
కరోనా టెస్టులు కావాలంటే కలెక్టర్ ను అడగండి అంటూ ఉచిత సలహా
‘గొర్రెకుంట ‘ కోవిడ్ బాధిత కుటుంబం పట్ల నిర్లక్ష్యం
కలెక్టర్ చెప్పేదొకటి ….వైద్యాధికారి ఆచరించే దొకటి

వరంగల్ రూరల్ జిల్లా గొర్రె కుంట బాధిత కుటుంబాన్ని గీసుగొండ మండల వైద్యాధికారి నిర్లక్ష్యపు సమాధానం మరింత గా కలచివేస్తుంది. అసలే ఆ ఇంటిలో ఒక్కరికీ కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉంటే వైద్యాధికారి మాధవీలత మాత్రం టెస్ట్ లు చేయండి అని ఫోన్ చేసినందుకు మేం టెస్ట్ లు చేయం మీ ఇష్టం అంటూ సమాధానం ఇచ్చి చేతులు దులుపుకొంది. ఎంత మాత్రం భాద్యత లేకుండా మాట్లాడి తనకేం అవసరం లేదు అన్నట్లు వ్యవహరించింది. మండల వైద్యాధికారి నిర్లక్ష్యపు ధోరణి పై కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.గీసుగొండ వైద్యాధికారి నిర్లక్ష్యం....!- news10.app

కలెక్టర్ ను అడగండి

వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట లో మహబు బాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్స్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఇంటిలో ఆమెతో పాటు ఒకే ఇంటిలో అత్త, మామ, భర్త, ఇద్దరు చిన్న పిల్లలతో పాటు అదే కాంపౌండ్ లో స్టాఫ్ నర్స్ మరిది కూడా ఉంటాడు. కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరంతా ఆందోళనకు గురి కాగా ఒక్క భర్తకే టెస్ట్ లు చేయగా నెగెటివ్ వచ్చింది. వీరు ఇమ్మ్యూనిటి పవర్ కలిగి ఉంటారు కనుక కరోనా సొకలేదు. చిన్న పిల్లలు,పెద్దలు అంతగా ఇమ్మ్యు నిటి పవర్ కలిగి ఉండరు కనుక టెస్టులు చేయాలని రూరల్ కలెక్టర్ హరిత గొర్రె కుంట ను సందర్శించి నపుడు బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇదే విషయమై స్టాఫ్ నర్స్ మరిది మండల వైద్యాధికారి కి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు టెస్ట్ లు చేస్తారా…? మేడం అని ప్రశ్నిస్తే కరోనా లక్షణాలు ఉంటే తప్ప టెస్ట్ లు చేయకూడదని పై నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. టెస్ట్ లు చేయరు కనుక క్వారంటీనే అవసరం లేదా అని ప్రశ్నిస్తే అది మీ ఇష్టం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. అంతే కాదు కలెక్టర్ టెస్ట్ లు చేస్తారని చెప్పింది కదా అని అడిగితే ఆ విషయం కలెక్టర్ నే అడగండి అంటూ చేతులు దులుపుకొంది. ఎట్టి పరిస్థితుల్లో తాము టెస్ట్ లు చేయమని తేల్చి చెప్పింది.

ఏమాత్రం భాద్యత లేదా ….?

టెస్ట్ లు చేయకున్నా కనీసం ఆందోళన చెందవద్దని మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వకుండా ఏమాత్రం భాద్యత లేనట్లు వైద్యాధికారి ప్రవర్తించింది అంటూ కొవిడ్ బాధిత కుటుంబం వాపోయింది. నిర్లక్ష్యపు సమాధానం తో తమలో మరింత భయాన్ని వైద్యాధికారి కలిగించింది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో దైర్యం గా ఉండాలని చెప్పాల్సింది పోయి మీ ఇష్టం కలెక్టర్ ను అడగండి అంటూ భాద్యత లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు అని వారు అడుగుతున్నారు.