బోర్డ్ తిప్పడానికి సిద్ధమైన కొన్ని చిట్ ఫండ్ లు…?
వేలు,లక్షలు,కోట్లు జనం సొమ్ముతో అతివేగంగా ఆర్థిక గ్రాఫ్ పెరిగిన చిట్ ఫండ్ ల వ్యవహారమిది.నెల నెలా డబ్బులు కట్టించుకొని అవసరానికి కేటాయించిన సమయానికి సొమ్ము చెల్లిస్తామని నమ్మబలికి చిట్టి ఎత్తుకున్న,చిట్టి పూర్తి అయిన డబ్బులు చెల్లించకుండా చిట్ ఫండ్ లకు ప్రాణాధారమైన ఖాతాదారులకు చుక్కలు చూపెడుతున్నారు.వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చిట్ ఫండ్ సంస్థలు ఖాతాదారుల దగ్గర నుంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సేకరించి వేలు వేలు అన్ని కలిపి కోట్ల రూపాయాలుగా మార్చి ఖాతాదారులను ఇబ్బంది పెడుతూ తమ ఇతర వ్యాపారాలకు మళ్లించుకుంటు చిట్ ఫండ్ల యజమానులు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అవసరానికి ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా వారి మరణానికి,మానసిక క్షోభ కు కారణం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వరంగల్ త్రి నగరిలో పెద్ద పెద్ద కార్యాలయాలతో ,సిబ్బందితో చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీలు సేకరించిన కోట్ల కొద్దీ సొమ్ము అసలు ఎటుపోతుంది. ఖాతాదారులనుంచి ముక్కుపిండి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పక్కదారి పడుతున్నాయి.. ఇంత జరుగుతున్నా చిట్ రిజిస్టార్ అధికారులు కానీ,ఐటి అధికారులు కానీ ఈ చిట్ ఫండ్ కంపెనీల పై ఎందుకు దృష్టి సారిచండం లేదనేది భేతాల ప్రశ్నగా మారింది…కోట్లల్లో ఆదాయం ఉన్న , కోట్ల రూపాయాలు టర్నోవర్ అవుతున్న ఇలాంటి చిట్ ఫండ్ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడంలేదో అర్థం కావడం లేదు.చిట్ వేసినందుకు వ్యాపార పరంగా రావాల్సిన కమీషన్, ఇతరత్రా ఆదాయాలు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యాలకు ఉన్న వారెందుకు ఖాతాదారులను ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పుడు అందరి మెధలల్లో మెదులుతున్న ప్రశ్న.
ఖాతాదారుల సొమ్ము పక్కదారి…?
తాము చిట్ ఫండ్ వ్యాపారంలో ప్రధానమైన వారిగా చెప్పుకొనే కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారుల సొమ్మును పక్కదారి పట్టిస్తున్నాయి. ఇది అధికారులనుంచి మొదలుకొని అందరికి బహిరంగ రహస్యమే…ఈ సొమ్ము ఎక్కడికి పోతుందో అందరికి తెలుసు కానీ ఎవరూ నోరు విప్పరు…నిజానికి కొన్ని ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీల్లో వసూలు అవుతున్న ఖాతాదారుల సొమ్ము అక్షరాల పక్కదారి పడుతోంది… ఈ సొమ్మును కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు భూముల కొనుగోలుకు వెచ్చించి వెంచర్ ల పేరుతో రియలేస్టేట్ వ్యాపారం నడుపుతున్నారు… ఈ వ్యాపారంలో లాభాలు వస్తే తప్ప ఖాతాదారులకు వారి డబ్బులు చెల్లించలేని స్థితిలో లేరని తెలుస్తుంది.కొన్ని చిట్ ఫండ్ లు కోట్ల రూపాయల ఖాతాదారుల సొమ్ము వె చ్చించి భూములు కొనుగోలు చేసి ఇంకా వెంచర్ లు చేయక భూమిని అలాగే ఉంచి సంవత్సరాలు గడుస్తున్నా, చిట్టి ముగిసిన ఖాతాదారులకు సొమ్ము చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.అంతేకాదు కొన్ని చిట్ ఫండ్ ల యజమానులు ఖరీదైన భవంతులు నిర్మించుకొని,విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసి ఖాతాదారుల సొమ్ముతో ఊరేగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ సొమ్ము కు లెక్కా పత్రం లేక ,ప్రశ్నించే వారు లేక ఖాతాదారుల సొమ్ము తో వీరు రాజభోగాలు అనుభవిస్తుంటే చిట్టి వేసిన ఖర్మానికి కొందరు ఖాతాదారులు సమయానికి డబ్బు అందక,అసలు డబ్బు చిట్ ఫండ్ లు చెల్లిస్తాయో లేదో తెలియక అనారోగ్యాలపాలవుతున్నారు.
బోర్డ్ తిప్పుతారా….?
ఖాతాదారులకు చెల్లించాల్సిన సొమ్ము కోట్లల్లో ఉంది… వసూలు చేసిన సొమ్ము అంత ఇతర వ్యాపారాల్లో ఉంది… దింతో ఖాతాదారులకు ఎం సమాధానం చెప్పాలో తెలియక ,ఎలా చెల్లించాలో తెలియక త్వరలో కొన్ని చిట్ ఫండ్ లు చేతులు ఎత్తేసి బోర్డ్ తిప్పే పనిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది…చిట్ ఫండ్ ల మోసాలు, వాటి భాదితులు,సమస్యలపై ప్రజాసేన అవినీతి నిరోధక సంస్థ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ప్రకటించగానే చిట్ ఫండ్ ల వల్ల మోసపోయిన భాదితులు వందల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.త్వరలో కొన్ని చిట్ ఫండ్ లు బోర్డ్ తిప్పే పనిలో ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారట. చిట్ ఫండ్ భాదితులు ఎక్కువగా ఉన్న ఓ చిట్ ఫండ్ సంస్థ “అక్షరా”ల ఇదే పని చేయబోతోందని కొందరు ఫోన్ చేసి అనుమానం వ్యక్తం చేశారట….తాము తలపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని ప్రజాసేన చెపుతోంది… బాధితుల బాధ ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాదలా ఉందని చెప్పారు.
డిపాజిట్ ల సేకరణ…?
ఇక కొన్ని చిట్ ఫండ్ లు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ ల సేకరణ చేశాయని…మాయమాటలతో నమ్మించి కోట్ల రూపాయలు డిపాజిట్ ల రూపంలో వసూలు చేసి వంద కోట్ల మార్క్ ను దాటిన చిట్ ఫండ్ లు సైతం ఉన్నట్లు సమాచారం.ఇలా నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ లను ఆసరాగా చేసుకుని డిపాజిట్ లు సేకరిస్తున్న ఈ విషయం ఆ నోట ఈ నోట అధికారుల వరకు చేరిన చర్యలు మాత్రం శూన్యంగా ఉండడంతో ఖాతాదారులకు అధికారులపై సైతం అనుమానాలు కలుగుతున్నాయి.చిట్ ఫండ్ ల మోసాలపై వేల సంఖ్యలో చిట్ రిజిస్టార్ కార్యాలయానికి భాదితులు ఫిర్యాదులు అందిన ఎలాంటి అతి గతి లేదు…కనీసం ఎం జరిగిందో విచారణ జరిపిన దాఖలాలు కూడా లేవు…అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప వాటిని పర్యవేక్షించకుండా గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
చిట్ ఫండ్ ల వెనుక అదృశ్య హస్తాలు….?
ఆస్తులపై,బినామిలపై ఆరా తీస్తారా….?
ఆర్థిక నేరాలకు కళ్లెం వేస్తారా…?
మరో సంచికలో…..