ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ జన్మదిన వేడుకలు టీఆరెస్ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ & కదలిక ఫౌండేషన్ ఛైర్మెన్ అలువాల రాజ్ కుమార్ ఆధ్వర్వంలో హన్మకొండలో ఘనంగా జరిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్ధించారు. రాజకీయాలలో ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికి రాదనీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎంపీ దయాకర్ గారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని టీఆరెస్ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ కదలిక ఫౌండేషన్ ఛైర్మెన్ అలువాల రాజ్ కుమార్ తెలిపారు.

ఎంపీ పుట్టినరోజు సందర్బంగా అలువాల రాజ్ కుమార్ ఆధ్వర్వంలో హన్మకొండలోని రెడ్ క్రాస్ లో రక్తదాన శిభిరం తో పాటు హంటర్ రోడ్ లోని అమ్మ అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ రోడ్ లోని అతిధి మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం పలు ఆసుపత్రుల్లో పండ్లు పంచి పెట్టారు. కరోనా కష్టకాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పుట్టిన రోజు సందర్బంగా ఉచితంగా శానిటైజెర్లు మాస్క్ లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ తో పాటు జవహర్ లాల్ రాజు ప్రశాంత్ తిరుపతి ఈర్య గణేష్ తదితరులు పాల్గొన్నారు.